https://oktelugu.com/

Night Dinner: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్!

Night Dinner: మారుతున్న జీవన శైలి వల్ల ప్రజల ఆహారపు అలవాట్లు సైతం మారుతున్నాయి. వేర్వేరు కారణాల వల్ల మనుషులను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఆహారం తీసుకునే విషయంలో సమయపాలన పాటించాలి. సరైన సమయానికి ఆహారం తీసుకోని వాళ్లను ఒబిసిటి, హృద్రోగ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తుండటం గమనార్హం. ఎవరైతే రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తింటారో వాళ్లను క్యాన్సర్ సమస్యలు వేధించే ఛాన్స్ ఉంది. రాత్రి 9 గంటల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 26, 2021 / 05:41 PM IST
    Follow us on

    Night Dinner: మారుతున్న జీవన శైలి వల్ల ప్రజల ఆహారపు అలవాట్లు సైతం మారుతున్నాయి. వేర్వేరు కారణాల వల్ల మనుషులను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఆహారం తీసుకునే విషయంలో సమయపాలన పాటించాలి. సరైన సమయానికి ఆహారం తీసుకోని వాళ్లను ఒబిసిటి, హృద్రోగ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తుండటం గమనార్హం. ఎవరైతే రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తింటారో వాళ్లను క్యాన్సర్ సమస్యలు వేధించే ఛాన్స్ ఉంది.

    Night Dinner

    రాత్రి 9 గంటల లోపే ఆహారం తీసుకోవాలని 9 గంటల కంటే ఆలస్యంగా ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి నష్టమే తప్ప లాభం ఉండదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. నిద్రపోవడానికి మూడు గంటల ముందు డిన్నర్ చేయాలని సూచనలు చేస్తున్నారు. ఎవరైతే రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేస్తారో వాళ్లకు గుండె సంబంధిత సమయలతో పాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.

    Also Read: తమలపాకు ఆరోగ్య సంజీవని.. రోజుకు రెండు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే?

    భోజనం విషయంలో సరైన సమయాలను పాటించకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. రాత్రి 10 గంటలకు, 11 గంటలకు భోజనం చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకుంటే మంచిది. ప్రస్తుత కాలంలో జీవనశైలి కారణంగా చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.

    ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూనె తక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. చక్కెరతో చేసిన ఆహర పదార్థాలను సైతం పరిమితంగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    Also Read: కేరళ రాష్ట్రంలో కొత్తరకం వైరస్.. లక్షణాలు ఏమింటే?