https://oktelugu.com/

కరోనాకు ‘నో’.. తికమకపెడుతున్న సెలబ్రెటీలు..!

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. అగ్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇటలీతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నారు.అయితే ఇటీవల కాలంలో కరోనా తగ్గుముఖం పడుతున్న కరోనా సేకండ్ వేవ్ ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రతీఒక్కరు తప్పనిసరిగా కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తున్నారు.మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కరోనా మహమ్మరి చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 / 12:25 PM IST
    Follow us on


    చైనాలోని వూహాన్లో సోకిన కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. అగ్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇటలీతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నారు.అయితే ఇటీవల కాలంలో కరోనా తగ్గుముఖం పడుతున్న కరోనా సేకండ్ వేవ్ ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రతీఒక్కరు తప్పనిసరిగా కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తున్నారు.మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కరోనా మహమ్మరి చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారినపడి మృతిచెందారు. దీంతో కరోనా పరిస్థితుల్లో నిర్లక్ష్యానికి నో చెప్పాలంటూ పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో అభిమానులకు సూచిస్తున్నారు.

    Also Read: బిగ్ బాస్-4: ‘ఇమ్యూనిటినీ’ కోల్పోయిన కంటెస్టెంట్లు..!

    ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ట్వీటర్లో తాజాగా ‘ఐ రిటైర్’ అని పోస్టు పెట్టింది. దీంతో ఆమె ఇంత తొందరగా రిటైర్ అవుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆమె కరోనా నుంచి పరిస్థితుల నుంచి రిటైర్ అవ్వాలని అనుకుంటున్నా.. మళ్లీ జనవరిలో ఆటలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. పీవీ సింధు ఇలా అర్థంకాకుండా పోస్టు పెట్టడంపై పలువురు నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు.

    ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ సైతం ‘ఇట్స్ నెవర్ టూ లేట్.. ఐ సే నో’ అంటూ సింధులాగే తన ట్వీటర్లో పోస్టు పెట్టింది. అయిదే దీని అర్థమేంటో కూడా వివరించడం విశేషం. కరోనా విషయంలో నిర్లక్ష్యానికి అవకాశం లేదని.. తర్వాత బాధపడే కంటే ముందుగానే కొన్ని విషయాల్లో ‘నో’ చెప్పాల్సిన అవసరం ఉందని.. ప్రస్తుత పరిస్థితులకు ‘నో చెబుతున్నానని.. భయం, అనిశ్చితి లాంటి వాటికి ‘నో’ చెబుతున్నా అంటూ వివరించింది.

    Also Read: బిగ్ బాస్-4: ఆ నలుగురిది ఓ బ్యాచ్.. మండిపడుతున్న నెటిజన్లు..!

    కరోనా పరిస్థితుల్లో ప్రతీఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. వైరస్ కు ధీటుగా ఎదుర్కొనేందుకు మనమంత కలిసికట్టుగా నడువాలని కాజల్  సూచించింది. తన కొత్త జీవితాన్ని సురక్షితమైన వాతావరణంలో గడుపాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. కాజల్.. సింధు పోస్టులు చూస్తుంటే మరింత సెలబెట్రీలు ఇలాంటి తికమక పోస్టులు పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. సెలబ్రెటీలు కరోనా ‘నో’ అంటుంటే సామాన్యులు మాత్రం కరోనాతో కలిసి బతికేందుకు సిద్ధపడుతుండటం గమనార్హం.