Akhanda 2 ticket prices: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రానికి ఇంకా సమస్యలు పూర్తిగా వీడిపోలేదు. ఆర్ధిక సమస్యల కారణంగా చివరి నిమిషం లో వాయిదా పడిన ఈ చిత్రం, ఎట్టకేలకు ఆ సమస్యలు సరిదిద్దుకొని విడుదలకు సిద్ధం అవ్వగా, ఇప్పుడు ఈ చిత్రానికి తెలంగాణ లో పెద్ద చుక్క ఎదురు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకు తెలంగాణ లో టికెట్ రేట్స్ హైక్స్, ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ 600 రూపాయిలు పెంచుకోవడానికి అనుమతిని ఇవ్వగా, రెగ్యులర్ షోస్ కి టికెట్ రేట్స్ సింగిల్ స్క్రీన్స్ కి 50 రూపాయిలు, మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ కి 100 రూపాయిలు పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారు. కేవలం ప్రీమియర్ షోస్ ద్వారా హైదరాబాద్ నుండి 3 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది ఈ చిత్రం.
దీని మీద విచారణ చేపట్టిన హైకోర్టు కాసేపటి క్రితమే ప్రభుత్వం ఇచ్చిన జీవో ని వెనక్కి తీసుకోవాలని, టికెట్ హైక్స్, ప్రీమియర్ షోస్ కి అనుమతిని నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగి వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అయినప్పటికీ మేకర్స్ షోస్ ని రద్దు చేస్తారా..?, ఓజీ సినిమాకు కూడా ఇలాగే టికెట్ రేట్స్ ని రద్దు చేశారు. కానీ దిల్ రాజు తన తరుపున న్యాయవాదితో లంచ్ పిటీషన్ మోషన్ వేసి మూడు రోజుల పాటు విచారణ జరిపేలా చేసారు. ఆ తర్వాత నాల్గవ రోజున జీవోని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ‘అఖండ 2’ చిత్రానికి కూడా అదే జరగబోతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ఏ ముహూర్తం లో ఈ సినిమాని మొదలు పెట్టారో కానీ, ఒక అడ్డంకి తొలగితే , మరో అడ్డంకి వచ్చి చేరుతుంది. చూడాలి మరి చివరికి ఏమి జరగబోతుంది అనేది.