Homeఎంటర్టైన్మెంట్అరెరే.. 'శిల్పా శెట్టి'లా ఎవరు చేయలేరట !

అరెరే.. ‘శిల్పా శెట్టి’లా ఎవరు చేయలేరట !

బాలీవుడ్ లో ఎంతో కష్టపడి తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ‘శిల్పాశెట్టి’. కానీ ఆమె భర్త రాజ్‌ కుంద్రా మాత్రం ఒక్క అరెస్ట్ తో ఆమె పరువును బజారున పెట్టాడు. మొత్తానికి భర్త చేసిన నీచమైన పని కారణంగా ప్రస్తుతం శిల్పా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. నిజానికి ‘శిల్పాశెట్టి’ చాల సున్నిత మనస్కులు అట. ఎప్పుడైతే ఆమె రాజ్ కుంద్రాను వివాహం చేసుకుందో అప్పటి నుండి ఆమె జీవితం ఆమె చేతుల్లో లేకుండా పోయింది అని, ఆమెకు […]

Shilpa Shetty as Judge in Dance Show

బాలీవుడ్ లో ఎంతో కష్టపడి తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ‘శిల్పాశెట్టి’. కానీ ఆమె భర్త రాజ్‌ కుంద్రా మాత్రం ఒక్క అరెస్ట్ తో ఆమె పరువును బజారున పెట్టాడు. మొత్తానికి భర్త చేసిన నీచమైన పని కారణంగా ప్రస్తుతం శిల్పా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. నిజానికి ‘శిల్పాశెట్టి’ చాల సున్నిత మనస్కులు అట.

ఎప్పుడైతే ఆమె రాజ్ కుంద్రాను వివాహం చేసుకుందో అప్పటి నుండి ఆమె జీవితం ఆమె చేతుల్లో లేకుండా పోయింది అని, ఆమెకు తెలియకుండానే చీటింగ్ కేసుల్లో కీలక పాత్ర పోషించాల్సి వచ్చిందని చాలామంది అభిప్రాయం. ఇది నిజమే కావొచ్చు. ఎందుకంటే క్రికెట్‌ బెట్టింగ్‌ మొదలు ఇప్పటిదాకా రాజ్‌కుంద్రా చేసిన పనుల వల్ల పరోక్షంగా అవమానాలు అనుభవించింది మాత్రం శిల్పాశెట్టినే.

అదేంటో తప్పు ఆమె భర్త చేస్తే.. సినీ జనం కూడా ఎక్కువ నిందలు మాత్రం ఆమె పైనే వేశారు. అన్నిటినీ ఓపిగ్గా భరించింది శిల్పా శెట్టి. తాజా కేసులో కూడా తన భర్త అరెస్ట్‌ అయితే, ఎక్కువమంది శిల్పా పైనే విమర్శలు చేశారు. దాంతో శిల్పా శెట్టి ప్రస్తుతం చేస్తోన్న పలు షోలకు కూడా దూరం కావాల్సి వచ్చింది. ముఖ్యంగా శిల్పా జడ్జిగా ఉన్న సూపర్‌ డ్యాన్సర్‌ రియాలిటీ షో నుంచి కూడా శిల్పా తాత్కాలికంగా వైదొలిగింది.

నిజానికి ఈ షో పాపులర్‌ అయింది అంటే శిల్పా శెట్టి పాత్ర చాల కీలకమైంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జడ్జిగా వ్యవహరించడానికి శిల్పా శెట్టి రెడీగా లేదట. అందుకే, శిల్పా శెట్టి స్థానంలో జడ్జిగా ఉండాలంటూ హీరోయిన్‌ రవీనా టాండన్‌ ని షో యాజమాన్యం సంప్రదించారని వార్తలు వస్తున్నాయి.

అయితే రవీనా టాండన్‌ మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. శిల్పాశెట్టిలా మరొకరు చేయలేరని, కాబట్టి శిల్పా స్థానాన్ని ఎవరు రీప్లేస్‌ చేయలేరని చెప్పుకొచ్చిందట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper