Pushpa 2 : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక తెలుగుతో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీకి కూడా బాలీవుడ్ లో భారీ డిమాండ్ అయితే పెరిగింది. పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు సినిమాలు చేస్తు ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇక వాళ్ల సత్తా చాటుకోవడానికి ప్రతి ఒక్క హీరో ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం తెలుగు హీరోలకు ఇండియా వైడ్ గా భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది…ఇక ఇదిలా ఉంటే మన హీరోల ఎదుగుదలను మన ఇండస్ట్రీ ముందుకు దూసుకెళ్లడాన్ని జీర్ణించుకోలేని బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పటికప్పుడు మన వాళ్ల మీద విషాన్ని కక్కుతూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా ‘పుష్ప 2’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని ఇండస్ట్రీ హిట్టు కొట్టడానికి మరొక అడుగు దూరంలో ఉన్న పుష్ప 2 సినిమాను చూసి బాలీవుడ్ టాప్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ అయిన రాకేష్ రోషన్ (హృతిక్ రోషన్ ఫాదర్) రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో గానీ సౌత్ ఇండస్ట్రీల్లో గానీ పెద్దగా వైవిధ్యం అయితే ఏమీ ఉండడం లేదు. వాళ్ళు పాతకాలపు పద్ధతిని ఆచరిస్తూ ముందుకు సాగుతూ సక్సెస్ లను సాధిస్తున్నారు. జనాలు కూడా వాటిని ఆదరిస్తూ ఉండడం విశేషం అంటూ ఆయన మాట్లాడాడు మొత్తానికైతే తెలుగు సినిమాలు రొడ్డ కొట్టుడు ఫార్మాట్లోనే ముందుకు సాగుతున్నాయి. తప్ప పెద్దగా వైవిధ్యమైతే ఏమి చూపించడం లేదు అనేది ఆయన భావన…
ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా వైవిధ్యం లేకుండానే వాళ్ళు సక్సెస్ లను సాధిస్తున్నారు వైవిధ్యాన్ని చూపించే ఏకైక ఇండస్ట్రీ బాలీవుడ్ మాత్రమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన కాంట్రవర్సీకి దారి తీశాయి. ఇక కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సైతం మా హీరోలకు బాడీలను చూపించడం తప్ప మంచి సినిమాలు చేయడం చేతకాదు అంటు పుష్ప 2 సినిమా ని పొగుడుతూ కామెంట్ అయితే చేశారు.
అలాగే అమితాబచ్చన్ సైతం నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అంటూ చెప్పడంతో ఇండియా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద అటెన్షన్ అయితే క్రియేట్ అయింది. కానీ ఇలాంటి సందర్భంలో రాకేష్ రోషన్ లాంటి ఒక అవుట్ డేటెడ్ డైరెక్టర్ తెలుగు సినిమాల మీద కామెంట్స్ చేయడం అనేది చాలా దారుణమైన విషయమనే చెప్పాలి… ఇక అతని కామెంట్లను చూసిన చాలామంది తెలుగు సినిమా అభిమానులతో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బాహుబలి, సాహో, త్రిబుల్ ఆర్, కల్కి, పుష్ప 2 లాంటి సినిమాలు వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఆ చిత్రాలు చాలా వైవిధ్యమైన కథాంశాలతో తెరకెక్కాయి.
ఇక ఇంతకు మించి బాలీవుడ్ మేకర్స్ పెద్దగా వైవిధ్యమైన కథాంశంతో ఏం తెరకెక్కిస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలేంటి అందులో చూపించిన వైవిధ్యం ఏంటి అంటూ అతని మీద విరుచుకుపడుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయిని జీర్ణించుకోలేని ఇలాంటి అవుట్ డేటెడ్ డైరెక్టర్లకి మన హీరోలు దర్శకులు సినిమాలతోనే సమాధానం చెబుతూ ఉండటం విశేషం…