Salaar Collection: సలార్ కి ఎన్ని వందల కోట్లు వచ్చిన కూడా ఆ 3 భాషల్లో మాత్రం డిజాస్టర్…

తమిళనాడులో అయితే ఈ సినిమాను పట్టించుకునే నాధుడే లేడు అంటూ అక్కడ ఈ సినిమా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున గగ్గోలు పెడుతున్నారు.

Written By: Gopi, Updated On : December 28, 2023 5:35 pm

Salaar Collections

Follow us on

Salaar Collection: భారీ అంచనాలతో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రభాస్ మరింత రెచ్చిపోయి సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమా మీద చాలా మందికి చాలా డౌట్లు ఉండేవి. కానీ ఒకసారి ఈ సినిమాని చూసిన తర్వాత ప్రేక్షకుడి ఆలోచన మొత్తం మారిపోయిందనే చెప్పాలి.ఈ సినిమా అంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుంది అని ఎవ్వరూ అంచనా వేయలేదు కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది…

ఇక ఈ సినిమా ఇప్పటి వరకు 600 కోట్లను కలెక్ట్ చేసింది.ఇక ఇదంతా ఒకేత్తు అయితే ఈ సినిమా తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో మాత్రం అసలు ఏమాత్రం తన ప్రభావాన్ని చూపించలేక పోతుంది.ఈ సినిమాకి ముందు ఈ మూడు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా జరిగినప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అక్కడ ప్రేక్షకులు ఎవరు కూడా ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా లేరనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక తమిళనాడులో అయితే ఈ సినిమాను పట్టించుకునే నాధుడే లేడు అంటూ అక్కడ ఈ సినిమా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున గగ్గోలు పెడుతున్నారు.ఇక పృధ్వీరాజ్ సుకుమారన్ సినిమాలో ఉన్నాడు కాబట్టి కేరళలో అంతో ఇంతో వసూలైతే వస్తున్నాయి.ఇక కర్ణాటకలో కూడా అదే పరిస్థితి అయితే ఈ సినిమా పట్ల అక్కడి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇక దానికి కారణం ఏంటి అనేది పెద్దగా తెలియదు కానీ ఈ సినిమా పట్ల మాత్రం అక్కడి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు గా కనిపించడం లేదు…

ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియాలో గర్జిస్తుంటే ఆ మూడు ప్రాంతాలలో మాత్రం ఈ సినిమా పెద్దగా విజయాన్ని దక్కించుకోవడం లేదు అంటూ అక్కడ డిస్టిబూటర్లు వాపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ ని మిగితా సినిమాలకు కూడా వాడుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కల్కి సినిమాను కూడా భారీ సక్సెస్ కొట్టె విధంగా తీర్చి దిద్దితున్నట్టు గా తెలుస్తుంది.