తెలుగు వెబ్ సీరిసులను పట్టించుకోరే?

గత కొన్నేళ్లుగా చిత్రసీమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో దేశంలో లాక్డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడగా, షూటింగులు వాయిదాపడ్డాయి. ఇది చిత్రసీమను మరింత సంక్షోభంలోకి నెట్టింది. అయితే ఈ పరిస్థితి మరో ఎంటైన్మెంట్ రంగానికి భారీ ఆదాయాన్ని సమకూరుస్తోంది. అదే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వారంతా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అలవాటు పడ్డారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు బడా నిర్మాతలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోన్నారు. కొందరు […]

Written By: Neelambaram, Updated On : May 16, 2020 1:56 pm
Follow us on

గత కొన్నేళ్లుగా చిత్రసీమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో దేశంలో లాక్డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడగా, షూటింగులు వాయిదాపడ్డాయి. ఇది చిత్రసీమను మరింత సంక్షోభంలోకి నెట్టింది. అయితే ఈ పరిస్థితి మరో ఎంటైన్మెంట్ రంగానికి భారీ ఆదాయాన్ని సమకూరుస్తోంది. అదే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వారంతా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అలవాటు పడ్డారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు బడా నిర్మాతలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోన్నారు. కొందరు సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే సన్నహాలు మొదలు పెడుతోన్నారు.

నిజానికి థియేటర్లో చూసే సినిమాకు ఓటీటీ చూసే వాటికి చాలా తేడా ఉంటుంది. థియేటర్లో అయితే టిక్కెట్టు పెట్టి మరీ చూడాల్సి ఉంది. సినిమా బాగా ఉన్నా లేకున్నా డబ్బులు పెట్టినందుకు చివరివరకు చూసేవారే ఎక్కువ. ఓటీటీ విషయంలో డబ్బులు పెట్టాల్సిన పనిలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిలో ప్రేక్షకులు అన్ని సినిమాలను చూడటం లేదు. కొన్ని హిట్టయిన సినిమాలను మాత్రమే చూస్తున్నారు. నచ్చితే చూస్తారు.. నచ్చకపోతే ఈ సోది అంతా ఎందుకని వాటిపై ఓ నిర్ణయానికొస్తున్నారు. అంతేకాకుండా విషయం ఉన్న సినిమాలు వేరే భాషలైనా ఆదరిస్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు వెబ్ సీరిస్ లు తీసుకొస్తున్నా కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్ సీరిస్ మంచి కంటెంట్ అందించడం కత్తిమీద సాములా మారింది.

ప్రస్తుతానికి ఇంగ్లీష్, హీందీ వెబ్ సీరిస్ లు మంచి కంటెంట్ అందిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. లస్ట్ స్టోరీస్, స్పెషల్ ఆప్స్, ది ఫ్యామిలీ మేన్ వంటి వెబ్ సీరిస్ క్వాలీటీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే తెలుగు వెబ్ సీరీస్ లు మాత్రం సదరు ప్రేక్షకులను ఆకట్టుకోవడం విఫలం అవుతోన్నాయి. కంటెంట్ విషయంలో చాలా నిరసంగా ఉండటంతో తెలుగు వెబ్ సీరిస్ లను చూసేందుకు ప్రేక్షకులు మొగ్గుచూపడం లేదని సమాాచారం. ఒకటి ఆరా మినహా తెలుగు వెబ్ సీరిస్ మిగతావన్నీ బీ గ్రేడ్ కేటగిరికి చెందిన కంటెంటే ఉంటున్నాయి. వీటిని సాధారణ ప్రేక్షకుడు పట్టించుకోవడం లేదు. కొత్తదనం, క్వాలీటీ అందిస్తే తెలుగు వెబ్ సీరిస్ లను చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పటికీ మేకర్స్ ఆ దిశగా ఆలోచించడం లేదు. దీంతో తెలుగు వెబ్ సీరిస్ ట్రెండ్ నీరసంగా సాగుతోంది. ఏదో తీశాం.. ఏదిపెట్టిన ప్రేక్షకుడు చూస్తాడులే అనే ధోరణి వీడకపోతే తెలుగు ప్రేక్షకుడు కొత్తదనం చూపిస్తున్న ఇంగ్లీష్, హిందీ వెబ్ సీరిస్ లకే అలవాటు పడిపోవడం ఖాయం. అలా జరిగే భవిష్యత్ లో తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్, వెబ్ సీరిస్ లు కనుమరుగడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుగు మేకర్స్ కొత్తదనంతో కూడిన వెబ్ సీరిస్ లను తీస్తారని ఆశిద్దాం.