https://oktelugu.com/

లాక్ డౌన్ ఎత్తివేత వ్యహాత్మకంగా జరగాలి:రాహుల్

లాక్‌ డౌన్‌ ను ఎత్తివేసే ప్ర‌క్రియ‌ను చాలా చాక‌చ‌క్యంగా జ‌ర‌గాల‌ని, ఇదొక ఈవెంట్ త‌ర‌హాలో కాకుండా, ఓ ప్ర‌క్రియ త‌ర‌హాలో జ‌ర‌గాల‌ని కాంగ్రెస్ నేత రాహుల్ సూచించారు.  ఇలాంటి స‌మ‌యంలో వృద్ధులు, రోగుల ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాల‌న్నారు. ఒక‌ర్ని త‌ప్పుప‌ట్టే స‌మ‌యం ఇది కాదు అని, కానీ వ‌ల‌స కూలీల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు. అంద‌రం క‌లిసి వారిని ఆదుకోవాల‌న్నారు. అధికారంలో ఉన్న బీజేపీ, అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.  అవ‌స‌ర‌మైన వారికి నేరుగా న‌గ‌దు ఇవ్వాల‌న్నారు. రాబోయ ఆర్థిక సునామీ గురించి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 16, 2020 / 02:23 PM IST
    Follow us on

    లాక్‌ డౌన్‌ ను ఎత్తివేసే ప్ర‌క్రియ‌ను చాలా చాక‌చ‌క్యంగా జ‌ర‌గాల‌ని, ఇదొక ఈవెంట్ త‌ర‌హాలో కాకుండా, ఓ ప్ర‌క్రియ త‌ర‌హాలో జ‌ర‌గాల‌ని కాంగ్రెస్ నేత రాహుల్ సూచించారు.  ఇలాంటి స‌మ‌యంలో వృద్ధులు, రోగుల ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాల‌న్నారు. ఒక‌ర్ని త‌ప్పుప‌ట్టే స‌మ‌యం ఇది కాదు అని, కానీ వ‌ల‌స కూలీల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు. అంద‌రం క‌లిసి వారిని ఆదుకోవాల‌న్నారు. అధికారంలో ఉన్న బీజేపీ, అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.  అవ‌స‌ర‌మైన వారికి నేరుగా న‌గ‌దు ఇవ్వాల‌న్నారు. రాబోయ ఆర్థిక సునామీ గురించి కూడా ఆలోచించాల‌న్నారు.

    ప్రజల ఖాతాల్లోకి తక్షణమే నగదును మళ్లించకుంటే లాక్‌ డౌన్‌ తో అతిపెద్ద విపత్కర సమస్యను ఎదుర్కొంటారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఒకతల్లి తన పిల్లలకు తినడానికి ఆహారం లభించేలా ఏవిధంగా ఏపనైనా చేస్తుందో, అదే విధంగా నిరు పేదల ఖాతాల్లోకి నగదు జమ అయ్యేలా చూడాలని అన్నారు. గతేడాది లోక్‌ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ఎన్‌ఎవైఎ పథకాన్ని ఆచరణలో పెట్టాలని కేంద్రానికి సూచించారు. దీనికింద నిరు పేదలకు రూ. 72 వేల ఆదాయం లభిస్తుందని అన్నారు. అలాగే లాక్‌డౌన్‌తో వలసకార్మికులు, చిన్నారులు వేలకిలోమీటర్లు కాలినడకన తమ గ్రామాలకు వెళ్తున్నారని, ఈ సమయంలో వారికి సందేశాలు అవసరం లేదని విమర్శించారు. దేశమంతా వారికి మద్దతుగా నిలవాలని అన్నారు. భారత నిర్మాణంలో వలస కార్మికులు కీలక భాగస్వాములన్న ఆయన.. వారికి తక్షణ సాయం అందేలా చూడాలని అన్నారు. చిన్న వ్యాపారులకు ప్రకటించిన ప్యాకేజిని నిజాయితీగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. లక్షలాది వలస కార్మికులు కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్నారని.. వలస కార్మికులతో పాటు భావిభారత చిన్నారులు రోడ్లపై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం జాగ్రత్తలు వహిస్తూ లాక్‌ డౌన్‌ ఎత్తివేతకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్థిక ప్యాకేజి విషయంలో ప్రధాని పునరాలోచించాలన్నారు. కరోనా కంటే ఆర్థిక నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.