
Samantha ‘Sakunthalam’ : మన హిస్టరీ కి సంబంధించిన సినిమాలు అంటే జనాలకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది.ముఖ్యంగా మహాభారతం మరియు రామాయణం మీద ఎన్ని సినిమాలు తీసిన ఎగబడి చూస్తారు.ఆ ధైర్యం తోనే అసలు ఫామ్ లోనే లేని ఒకప్పటి క్రియేటివ్ డైరెక్టర్ గుణ శేఖర్, సమంత ని ప్రధాన పాత్రలో పెట్టి ‘శాకుంతలం’ అనే సినిమా తీసాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు చిక్కులో పడింది.
ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని, మరోసారి వాయిదా వేస్తే మేము ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చెయ్యము అంటూ బయ్యర్లు గుణశేఖర్ కి హెచ్చరికలు జారీ చేసారు.జనాల్లో ఈ సినిమాపై అసలు అంచనాలే లేవని , ఒకవేల విడుదల చేసిన డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందని, ట్రైలర్ అంత చెత్తగా ఉంది, గ్రాఫిక్స్ అమీర్ పెట్ లో చేసినట్టు ఉందంటూ బయ్యర్స్ చెప్తున్నారట.
దీనితో డైరెక్టర్ గుణశేఖర్ ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది.ఎందుకంటే ఈ సినిమాకి కేవలం ఆయన దర్శకత్వం మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరించాడు.దిల్ రాజు మరో సహనిర్మాతగా వ్యవహరించాడు.దిల్ రాజు కి ఈ సినిమా భవిష్యత్తు అర్థం అయ్యిందో ఏమో తెలియదు కానీ , ఆయన నోటి నుండి ఈ సినిమా ఊసే రావడం లేదు.ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేస్తునట్టు ఇది వరకే తెలియజేసారు.
ఇప్పుడు ఈ తేదికి కూడా వచ్చే అవకాశాలు లేవని ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తుంది.ఫైనల్ రషెస్ చూసిన గుణశేఖర్ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసి, గ్రాఫిక్స్ వర్క్ కూడా మరింత మెరుగ్గా చేయించి విడుదల చేస్తే బాగుంటుందని గుణ శేఖర్ అభిప్రాయం అట.మరి దీనికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.