
Balagam collections : సినిమాలో కంటెంట్ ఉంటే చాలు, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది జనాలు చూడరు, నెత్తిన పెట్టుకొని మరీ ఆరాధిస్తారు మన తెలుగు ఆడియన్స్ అని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి.ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో కూడా చిన్న సినిమాలు థియేటర్స్ లో ఆడుతున్నాయి అంటే, మన తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పవాళ్ళో అర్థం చేసుకోవచ్చు.
రీసెంట్ గా విడుదలైన ‘బలగం’ సినిమా వసూళ్లను చూస్తుంటే మన ఆడియన్స్ ఎంత మంచివాళ్ళో అర్థం అవుతుంది.ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు.ప్రియా దర్శి మరియు కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లు గా నటించారు.కనీసం కోటి రూపాయిల బడ్జెట్ కూడా అవ్వని ఈ చిత్రానికి ఓపెనింగ్స్ పెద్దగా లేవు కానీ, అద్భుతమైన సినిమా అని టాక్ రావడం తో రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి.
ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ‘మా సినిమాకి మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి.అన్ని ప్రాంతాలలో షోస్ కూడా పెరిగాయి, రెండవ రోజు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి,మూడవ రోజు కూడా మొదటి రెండు రోజులకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.అలా ఈ సినిమా మూడు రోజులకు గాను కేవలం నైజాం ప్రాంతం నుండే రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమాకి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి’ అని దిల్ రాజు ఈ సందర్భంగా తెలిపాడు.ఇక మొదటి సోమవారం రోజు కూడా ఈ సినిమాకి డీసెంట్ స్థాయి వసూళ్లు రావడం తో ఫుల్ రన్ లో కచ్చితంగా పది కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు,మరి వారి అంచనాలకు ఈ సినిమా చేరుకుంటుంది లేదా అనేది చూడాలి.