korean Remake: సూపర్ హిట్ అందుకున్న సినిమా ఏదైనా సరే భాష వంటి విభేదాలు లేకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమేక్ చేస్తున్నారనే అని చెప్పొచ్చు. అలా తెరకెక్కిన చిత్రాలు కూడా మంచి విషయాలు దక్కించుకున్నాయి అయితే ఈ మధ్యకాలంలో విడుదలైన సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ” ఓ బేబీ”. ఈ మూవీని కొరియన్ సినిమా ఆధారంగా తెరకెక్కినదే ,ప్రస్తుతం ఇంకో కొరియన్ చిత్రం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకుడు వ్యవహరిస్తున్నారు.
రెజీనా,నివేదా థామస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుదీర్ వర్మ దర్శకత్వంలో “మిడ్ నైట్ రన్నర్స్ ” అనే కొరియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ ,క్లాస్ పిక్చర్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
తాజాగా ఈ రీమేక్ చిత్రానికి ‘శాకిని డాకిని’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.అయితే షూటింగ్ పనులు పూర్తి చేసిన ఈ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇవ్వనున్నారు చిత్ర యూనిట్.ఈ చిత్రం తరువాత మాస్ రాజా రవితేజ 70వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుధీర్ వర్మ.