https://oktelugu.com/

పవన్ కి జోడీగా నివేదా పేతురేజ్

ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్థితుల్లో సినిమా షెడ్యూల్స్ , తారాగణం అన్నిట్లో మార్పులు చేర్పులు జరగడం తప్పని సరి అవుతోంది ఇంకా చెప్పాలంటే సినిమా ప్లానింగ్ అంతా మారిపోతోంది .ఇపుడు త్వరలో ప్రారంభం కాబోయే పవన్ కల్యాణ్ చిత్రం కూడా నటీనటుల విషయం లో చాలా తర్జన భర్జన జరుగు తోంది .పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది ఈ చిత్రం తరువాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక […]

Written By:
  • admin
  • , Updated On : April 25, 2020 / 09:58 AM IST
    Follow us on


    ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్థితుల్లో సినిమా షెడ్యూల్స్ , తారాగణం అన్నిట్లో మార్పులు చేర్పులు జరగడం తప్పని సరి అవుతోంది ఇంకా చెప్పాలంటే సినిమా ప్లానింగ్ అంతా మారిపోతోంది .ఇపుడు త్వరలో ప్రారంభం కాబోయే పవన్ కల్యాణ్ చిత్రం కూడా నటీనటుల విషయం లో చాలా తర్జన భర్జన జరుగు తోంది .పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది ఈ చిత్రం తరువాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. ఇదొక పిరియాడికల్ మూవీ. మొఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా నిర్మితం అవుతోంది. పండగ సాయన్న అనే ఒక తిరుగుబాటు దారుడు కథ ఇది. ఇందులో కథ అంతా ‘కోహినూర్’ వజ్రం చుట్టూ తిరుగుతుంది అంటున్నారు . ఆ వజ్రాన్ని చేజిక్కించుకునే బందిపోటు దొంగగా పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు.

    ఇక ఈ సినిమాలో కథానాయిక పాత్రకిగాను పలువురి పేర్లు పరిశీలన లోకి వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండేజ్ అని ఒకసారి , మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ పేరు ఇంకో సారి వినిపించాయి. ఇపుడు వాళ్లిద్దరూ పక్కకు పోయి తాజాగా నివేదా పేతురాజ్ పేరు తెరపైకి వచ్చింది. కథానాయికగా ఆమె ఎంపిక కన్ఫర్మ్ అయి పోయిందని తెలుస్తోంది. నివేదా పేతురాజ్ మంచి హైట్ .. అందువలన పవన్ కళ్యాణ్ సరసన జోడీ గా బాగుంటుందనే అభిప్రాయం తో సెలెక్ట్ చేశారట.`.చిత్రలహరి , .ఆల వైకుంఠపురంలో ‘ తరవాత నివేదా పేతురాజ్ మళ్ళీ మెగా ఫామిలీ మెంబర్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించు కొనడం ఆమె కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.