నరేష్ ఇప్పుడు మారిన మనిషి

దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ కొడుకుగా ఆయన దారిలోనే పయనించిన నరేష్ తొలి చిత్రం ‘అల్లరి’ నే ఇంటి పేరుగా మార్చుకొని అల్లరి నరేష్ అయ్యాడు. ఆ తరవాత తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా ‘అల్లరి’ నరేశ్ తనదైన ముద్ర వేశాడు. తొలి నాళ్లలో ` నేను ` ‘ ప్రాణం ‘ `గమ్యం ‘ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్ని పోషించినప్పటికీ అవి సత్పలితాలను ఇవ్వలేదు. దాంతో కామెడీ చిత్రాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి […]

Written By: admin, Updated On : April 25, 2020 9:48 am
Follow us on


దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ కొడుకుగా ఆయన దారిలోనే పయనించిన నరేష్ తొలి చిత్రం ‘అల్లరి’ నే ఇంటి పేరుగా మార్చుకొని అల్లరి నరేష్ అయ్యాడు. ఆ తరవాత తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా ‘అల్లరి’ నరేశ్ తనదైన ముద్ర వేశాడు. తొలి నాళ్లలో ` నేను ` ‘ ప్రాణం ‘ `గమ్యం ‘ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్ని పోషించినప్పటికీ అవి సత్పలితాలను ఇవ్వలేదు. దాంతో కామెడీ చిత్రాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి కెరీర్ కొనసాగించాడు. ఆ క్రమంలో `కితకితలు `, ` అత్తిలి సత్తిబాబు ‘ ` సుడిగాడు ‘ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ చిత్రాలే కామెడీ హీరోని చేశాయి స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టాయి.

అయితే ఇపుడు కామెడీ సినిమాలకు ఆదరణ తగ్గింది. ఒకరకం గా చెప్పాలంటే బుల్లితెర కామెడీ కి పెద్ద పీట వేయడం తో ఆ ఎఫెక్ట్ సినిమాల ఫై పడింది. అందుకే నరేష్ ఇపుడు మళ్ళీ సీరియస్ సినిమాల వైపు ద్రుష్టి సారించాడు. అలాంటి డెసిషన్ తీసుకొని ‘బంగారు బుల్లోడు’, ‘ నాంది ‘ వంటి చిత్రాలు చేసాడు. వాటిలో `బంగారు బుల్లోడు ` చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఇక ‘నాంది’ చిత్రం ఇంకా చిత్రీకరణను పూర్తి చేసుకోవలసి వుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగు తిరిగి మొదలు కానుంది.కాగా ఈ చిత్రం ఫై నరేష్ గంపెడు ఆశలు పెట్టుకొన్నాడు . ‘నాంది’ చిత్రం తన సినీ కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాడు. అంతేకాదు తనకు నెగెటివ్ కేరక్టర్లు చేయాలని ఉంది అని కూడా చెబుతున్నాడు .అంతేకాదు వెబ్ సిరీస్ లలోను నటించడానికి నేను సిద్ధంగానే వున్నాను . అని మనసులోని మాట బైటపెట్టాడు .