https://oktelugu.com/

బిజీ అవుతున్న నివేద పేతురేజ్

2017 లో వచ్చిన మెంటల్ మదిలో చిత్రం తో తెలుగు నాట కాలు మోపిన తమిళ పొన్ను నివేథ పేతురాజ్ టాలీవుడ్ లో మెల్ల మెల్లగా తన స్థానాన్ని పదిల పరుచు కొంటోంది. తెలుగు ప్రేక్షకులకు మెంటల్ మదిలో చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు గత ఏడాది చిత్రలహరి ఇంకా బ్రోచేవారెవరు రా అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందంతో పాటు అద్బుతమైన అభినయ ప్రతిభ ఉన్న నాయిక గా నివేథ పేతురాజ్ కు పేరొచ్చింది. […]

Written By: , Updated On : March 12, 2020 / 03:59 PM IST
Follow us on

2017 లో వచ్చిన మెంటల్ మదిలో చిత్రం తో తెలుగు నాట కాలు మోపిన తమిళ పొన్ను నివేథ పేతురాజ్ టాలీవుడ్ లో మెల్ల మెల్లగా తన స్థానాన్ని పదిల పరుచు కొంటోంది. తెలుగు ప్రేక్షకులకు మెంటల్ మదిలో చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు గత ఏడాది చిత్రలహరి ఇంకా బ్రోచేవారెవరు రా అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందంతో పాటు అద్బుతమైన అభినయ ప్రతిభ ఉన్న నాయిక గా నివేథ పేతురాజ్ కు పేరొచ్చింది. అందుకే నివేద పేతురేజ్ కి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన అల వైకుంఠపురంలో సినిమాలో రెండవ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు.

అల వైకుంఠపురం లో నివేద నటన అల్లు అర్జున్ కు కూడా నచ్చడంతో తన తదుపరి చిత్రానికి హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే రెండు మెగా చిత్రాల్లో నటించిన నివేద మరో మెగా ఛాన్స్ ను దక్కించుకుంది. ఆల్రెడీ చిత్రలహరి చిత్రంలో సాయి ధరమ్ తేజ్ తో కల్సి నటించిన నివేథ పేతురాజ్ మరోసారి సాయి తేజ్ తో జత కట్టేందుకు సినిమా సిద్దం అయ్యింది.

విశ్వసనీయంగా తెలుస్తున్న దాన్ని బట్టి ” సోలో బ్రతుకే సోబెటర్ ” చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ దేవా కట్టా దర్శకత్వం లోచేయబోతున్న మూవీలో హీరోయిన్ గా ఈ తమిళ పొన్నుని ఎంపిక చేశారట. నటన ప్రతిభ ఉన్న అమ్మాయిని ఈ సినిమా కోసం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో నివేథ పేతురాజ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది..ఈ చిత్రమే కాకుండా ప్రస్తుతం రామ్ ‘రెడ్’ లో కూడా ఈ నివేద నటి స్తోంది.ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి ఈ ఏడాది నివేద పేతురాజ్ తెలుగు లో పలు సినిమాలతో బిజీగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
Talent is her investment