Nivetha Pethuraj Marriage: ప్రముఖ యంగ్ హీరోయిన్ నివేద పేతురాజ్(Nivetha Pethuraj) ఈ ఏడాది ఆగస్టు నెలలో రాజ్ హిత్ ఇబ్రాన్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. చాలా కాలం నుండి అతనితో రహస్యం గా ప్రేమాయణం నడుపుతూ వచ్చిన నివేద, నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి త్వరలోనే మా ఇద్దరి పెళ్లి జరగబోతుంది అంటూ అధికారిక ప్రకటన చేసింది. రాజ్ హిత్ సినీ ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తి కాదు. దుబాయి లో ఒక ప్రముఖ వ్యాపార వేత్త. మోడలింగ్ రంగం లో ఉన్న సమయం లోనే నివేద కు రాజ్ హిత్ పరిచయం అయ్యాడు. అప్పటి నుండే వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కానీ పెళ్లి వరకు వచ్చి ఆగిపోవడం శోచనీయం. రీసెంట్ గానే ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహాన్ని రద్దు చేసుకోవడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతలోపే నివేద పేతురాజ్ కూడా పెళ్లిని రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక నివేద పెతు రాజ్ గురించి మన అందరికీ తెలిసిందే. ఈమె పెద్ద స్టార్ హీరోయిన్ అయితే కాదు, కనీసం మీడియం రేంజ్ హీరోయిన్ గా కూడా స్థిరపడలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా, ఆడియన్స్ గుర్తించుకోదగ్గ సినిమాలే చేసింది. ఇప్పటి వరకు ఈమె తెలుగు లో ‘మెంటల్ మదిలో’, ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అలా వైకుంఠపురంలో’, ‘రెడ్’, ‘పాగల్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలు చేసింది. వీటిల్లో ‘పాగల్’ అనే చిత్రం మినహా మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి హిట్ అయ్యాయి. అంతే కాకుండా ఈ చిత్రాలకు ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సక్సెస్ ఫుల్ సినిమాల్లో హీరోయిన్ అయినప్పటికీ కూడా ఎందుకో నివేద పేతురాజ్ మరో లెవెల్ కి వెళ్లలేకపోతుంది.
అయితే ఈమె సినిమాల్లోనే కాదు, వెబ్ సిరీస్ లలో కూడా ఫుల్ బిజీ గా గడుపుతోంది. గత ఏడాది ఈమె ‘పరువు’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు కానీ, వెబ్ సిరీస్ లు కానీ లేవు. ఖాళీ సమయం దొరకడం తో పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ దురదృష్టం కొద్దీ ఆ పెళ్లి రద్దు అయ్యింది. చూడాలి మరి ఈమె భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.