https://oktelugu.com/

Niveda Pethuraj : నా క్లోజ్ ఫ్రెండే నా లవర్ ని లేపుకుపోయింది… నివేద పేతురాజ్ ప్రేమకథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

Niveda Pethuraj : నివేద పేతురాజ్ కి ఓ ట్రాజిక్ లవ్ స్టోరీ ఉందట. తన బెస్ట్ ఫ్రెండే ఆమె లవర్ ని లేపుకుపోయిందట. తాజా ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆమెకు షాకింగ్ కామెంట్స్ చేశారు. నివేదా పేతురాజ్ మాట్లాడుతూ... నేను ప్రేమలో మోసపోయాను. అందుకే ఎవరూ ప్రేమలో పడకండి. ఒకవేళ పడినా జాగ్రత్తగా ఉండండి. అనుభవంతో చెబుతున్నాను. నా క్లోజ్ ఫ్రెండే నా లవర్ ని తీసుకుని వెళ్ళిపోయింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2024 / 09:59 PM IST

    nivetha-pethuraj-hits-back-at-fa

    Follow us on

    Niveda Pethuraj : నివేద పేతురాజ్ కి కాలం కలిసి రాలేదు. లేదంటే ఆమె స్టార్ కావాల్సింది. అందం, అభినయం ఉండి కూడా ఆమె కెరీర్ లో ఎదగలేదు. నివేద పేతురాజ్ మెంటల్ మదిలో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. మెంటల్ మదిలో ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది. సాయి ధరమ్ తేజ్ కి జంటగా నటించిన చిత్రలహరి ఓ మోస్తరు విజయం అందుకుంది. బ్రోచేవారెవరురా సూపర్ హిట్. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్. అయితే నివేద పేతురాజ్ ప్రాధాన్యత లేని సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది.

    దాంతో అల వైకుంఠపురంలో ఆమె కెరీర్ కి ఏ విధంగానూ ఫేవర్ చేయలేదు. చెప్పాలంటే నివేద కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. దాంతో డిజిటల్ సిరీస్లు కూడా చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన పరువు వెబ్ సిరీస్ జీ 5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం నివేద పేతురాజ్ చేసిన ఫ్రాంక్ వీడియో వైరల్ అయ్యింది. తన కారును పోలీసులు చెక్ చేయాలని అడ్డగించగా.. నివేద పేతురాజ్ వారితో దురుసుగా ప్రవర్తించింది. నిజమే అన్నట్లు ఈ ఫ్రాంక్ వీడియో ఉంది. నివేద పేతురాజ్ కి బంధువులు, సన్నిహితుల దగ్గర నుండి ఫోన్స్ కూడా వచ్చాయట.

    దాంతో కనీసం టైటిల్ రిలీజ్ చేయమని యూనిట్ సభ్యులను వేడుకుందట. ఇదిలా ఉంటే… నివేద పేతురాజ్ కి ఓ ట్రాజిక్ లవ్ స్టోరీ ఉందట. తన బెస్ట్ ఫ్రెండే ఆమె లవర్ ని లేపుకుపోయిందట. తాజా ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆమెకు షాకింగ్ కామెంట్స్ చేశారు. నివేదా పేతురాజ్ మాట్లాడుతూ… నేను ప్రేమలో మోసపోయాను. అందుకే ఎవరూ ప్రేమలో పడకండి. ఒకవేళ పడినా జాగ్రత్తగా ఉండండి. అనుభవంతో చెబుతున్నాను. నా క్లోజ్ ఫ్రెండే నా లవర్ ని తీసుకుని వెళ్ళిపోయింది.

    లవ్ ఫెయిల్యూర్ కారణంగా చాలా డిస్టర్బ్ అయ్యాను. మానసిక వేదన అనుభవించాను. ఇలా జరుగుతుందని నాకు ముందే కల వచ్చింది. తర్వాత చాలా కలలు వచ్చాయి. వచ్చినవన్నీ నిజమయ్యాయి. దాంతో నాకు సూపర్ పవర్స్ ఉన్నాయేమో అనే సందేహం కలుగుతుంది, అన్నారు. నివేద పేతురాజ్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ విన్న ఫ్యాన్స్ అయ్యో అంటున్నారు. ప్రస్తుతం నివేద పేతురాజ్ చేతిలో అధికారికంగా ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. గత ఏడాది విడుదలైన దాస్ కా ధమ్కీ ఆమె చివరి చిత్రం.