Nivetha Pethuraj: టాలీవుడ్‌లో అందంగా ఉండే హీరోయిన్‌లలో నివేదా పేతురాజ్ కచ్చితంగా ఉంటుంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదితో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నివేదా తన అందంతో వరుస అవకాశాలను దక్కించుకుంది. టిక్ టిక్ టిక్, చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అల వైకుంఠపురములో, పాగల్ వంటి సినిమాలతో అలరించింది. తాజాగా బ్లడీ మేరీ సినిమాలో నివేదా నటించి థ్రిల్‌కు గురిచేసింది. ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

ప్రస్తుతం నివేదా పెతురాజ్ ఫోటో షూట్ చేయించుకోగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో బాత్‌రూంలో అద్దం ముందు నిలబడి నివేదా తీసుకున్న ఫోటో కుర్రకారును మత్తెక్కిస్తోంది. అటు ఇటీవల విడుదలైన బడ్లీ మేరీ సినిమాలో మేరీగా నివేదా నటన అందరినీ ఆకట్టుకుంటోంది. విశాఖ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ మరో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో కిరీటి దామరాజు, రాజ్‌కుమా కోపిశెట్టి ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
నివేదా పెతురాజ్ 1991, నవంబర్ 30న తమిళనాడులోని కోవిల్పట్టి అనే గ్రామంలో జన్మించింది. తన పాఠశాల విద్యను తూత్తుకుడిలో పూర్తి చేసింది. తన చిన్న వయస్సులోనే తల్లిదండ్రులతో దుబాయ్ వెళ్లి 20 ఏళ్ల పాటు అక్కడే ఉంది. 2015లో మిస్ ఇండియా యూఏఈ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో సినిమా అవకాశాలు ఆమెను వరించాయి. 2016లో ఒరు నాల్ కూతు అనే తమిళ సినిమాతో నివేదా పెతురాజ్ తెరంగేట్రం చేసింది.
నివేదా పెతురాజ్ ప్రస్తుతం తెలుగులో రానా హీరోగా వస్తోన్న విరాట పర్వంలో నటిస్తోంది. పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. ఈ మూవీ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ విరాటపర్వం సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.