Plastic Water Bottle: ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ వాడకం సర్వ సాధారణమైపోయింది. ప్లాస్టిక్ వాడకం నిషేదమని ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదు. సమ్మర్ లో ప్రతిఒక్కరూ దాహం తీర్చుకోవడానికి వాటర్ బాటిల్ ను క్యారీ చేస్తుంటారు. అది ఎంత ప్రమాదమో వారికి తెలియదు. వేసవిలో ఆరుబయట ఉంచిన ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల అందులోని ప్లాస్టిక్ కరిగి మరింత హాని చేస్తుంది. ప్లాస్టిక్ బాటిళ్లలోని రసాయనాలే కాకుండా ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బాటిళ్లలోని రసాయనాలు నీళ్లలో కలిసినప్పుడు రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఆహారపదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో బాటిల్స్ లలో నిల్వ చేయడం వల్ల కలుషితమై ఆనారోగ్యానికి కారణం అవుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

ప్లాస్టిక్ బాటిళ్లు ఎక్కువసేపు ఎండలో ఉంచినప్పుడు కొన్ని టాక్సిన్స్, డయాక్సిన్, బైపినాల్ విడుదల చేస్తాయి. ఇవి రక్తంలో ఎక్కువగా కలిస్తే అది మీ హార్మోన్లలో మార్పులకు కారణమవుతుంది. డయాబెటిస్, ఒబెసిటీ, సంతాన సమస్యలు, ఆడపిల్లల్లో రుతుస్రావం త్వరగా రావడం వంటి సమస్యలు వస్తాయి. గుండె సమస్యలు, విరేచనాలు, వాంతులు మరియు అల్సర్ వంటి సమస్యలను కలిగిస్తుంది. డయాక్సిన్ గల నీటిని తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగితే వ్యాధి నిరోధక శక్తి కూడా సన్నగిల్లుతుంది. కాలేయ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుంది. మగవారిలో శుక్ర కణాల సంఖ్యపై ప్రభావితం చేస్తుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే బెథాలేట్ అనే రసాయనం నీటిలో కలుస్తుంది ఈ వాటర్ తాగినప్పుడు రక్తంలో కలిసిపోతుంది. దీంతో కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే పురుషులలో స్పెర్మ్ కౌంట్, క్వాలిటీని కూడా తగ్గిస్తుంది.
ఎండలో ఉన్న పెద్దపెద్ద కంటైనర్లు కూడా ఎక్కువ రోజులు వాడుతూ ఆ నీటిని తాగితే ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బదులు మెటల్… రాగీ.. స్టీల్ కోటింగ్ బాటిల్స్ వాడితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందుకే సమ్మర్ లో ప్లాస్టిక్ బాటిళ్లు వాడకపోవడమే మంచిది.