Nithya Menon: సౌత్ ఇండియా లో అందం తో మాత్రమే కాకుండా, తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించే హీరోయిన్స్ లో ఒకరు నిత్యా మీనన్. మలయాళం లో చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి, ఆ తర్వాత అక్కడ హీరోయిన్ గా మారి, మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న తర్వాత తెలుగు లో ఆమె ‘అలా మొదలైంది’ అనే చిత్రం తో మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రం పోషిస్తూ ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. అయితే నిత్యామీనన్ మాట తీరు కూడా చాలా ముక్కుసూటితనం తో ఉంటుంది.
మనసులో ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఆమె మాట్లాడే మాటలు ఒక్కోసారి వివాదాలకు కూడా దారి తీస్తూ ఉంటుంది. కానీ ఆమె మాట్లాడే మాటలను చూస్తే నిజమే కదా అని అనిపించక తప్పదు. రీసెంట్ గా ఆమె ప్రముఖ తమిళ యంగ్ హీరో ధనుష్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నేరుగా ఆయన పేరుని ప్రస్తావించకపోయిన, పరోక్షంగా ఆయన గురించే మాట్లాడింది అంటూ చెప్పుకొస్తుంది కోలీవుడ్ మీడియా. ఆమె మాట్లాడుతూ ‘ఒక సినిమా సక్సెస్ అయితే, అది ఆ సినిమా కోసం కష్టపడి పని చేసిన ప్రతీ ఒక్కరి క్రెడిట్ లోకి వస్తుంది. కొంతమంది పైకి అలా కనిపిస్తారు కానీ, అందరికీ గౌరవం ఇస్తున్నట్టు నటిస్తారు. కానీ మనసులో వేరే ఉంటుంది. సెట్స్ లో తాము ఆకాశం నుండి ఊడిపడిన వ్యక్తులు లాగా ఈగో ని చూపిస్తుంటారు . వాళ్ళు మాట్లాడే మాటలకు, ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం ఉండదు’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
ఇది కచ్చితంగా ధనుష్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని కోలీవుడ్ లో పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ. వీళ్లిద్దరు కలిసి తమిళం లో ‘తిరు చిత్రంబలం’ అనే చిత్రం లో నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, రెండు నేషనల్ అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది. ఒక అవార్డు ఆ చిత్రం లో ఒక పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ కి, రెండవది ఆ చిత్రం లో అద్భుతంగా నటించిన నిత్యామీనన్ కి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇక్కడే ధనుష్ ఈగో దెబ్బ తిన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆ సినిమా షూటింగ్ సమయంలో కూడా ధనుష్ సెట్స్ లో చాలా యాటిట్యూడ్ తో కనిపించేవాడట. కొన్ని సందర్భాల్లో వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ కూడా నడిచిందని అంటున్నారు.