https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ కారణంగా ప్రతీ రోజు వెక్కిళ్లు పెట్టి ఏడ్చేదానిని..నరకం అనుభవించాను : నిత్యా మీనన్

అవి చూసి ప్రభాస్ అభిమానులు ఆమెని సోషల్ మీడియా లో టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ల్స్ చేసేవారట. ఆ ట్రోల్స్ చూసి నిత్యామీనన్ ఏడవని రోజు లేదట. కేరళ లో పుట్టి పెరిగిన నిత్యామీనన్ కి మన టాలీవుడ్ నుండి కేవలం చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మరియు అల్లు అర్జున్ మాత్రమే తెలుసట

Written By: , Updated On : August 10, 2024 / 09:07 PM IST
Nithya Menon comments that she cries because of Prabhas

Nithya Menon comments that she cries because of Prabhas

Follow us on

Prabhas : ఇండస్ట్రీ లో అందాల ఆరబోతలు చేస్తేనే అవకాశాలు వస్తున్న రోజులివి. అందుకే హీరోయిన్స్ కి అందం ఉన్నంత కాలమే కెరీర్ ఉంటుంది, ఒక వయస్సు వచ్చాక వాళ్లకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. కానీ అందాన్ని నమ్ముకోకుండా కేవలం టాలెంట్ ని నమ్ముకున్న హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ మంచి డిమాండ్ తో కొనసాగుతూనే ఉన్నారు. మన చిన్నతనం లో అలరించిన హీరోయిన్లు కూడా నేటి తరం యువతని అలరిస్తున్నారంటే దానికి కారణం టాలెంట్ ఉండడమే. అలా అందాన్ని కాకుండా టాలెంట్ ని నమ్ముకొని ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు నిత్యా మీనన్.

బాలనటిగా మలయాళం లో ఎన్నో సినిమాల్లో నటించి, ఆ తర్వాత పెద్దయ్యాక మలయాళం లో హీరోయిన్ గా నటించి అక్కడి ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. నిత్యా మీనన్ లోని సహజమైన నటనని చూసి డైరెక్టర్ నందిని రెడ్డి ‘అలా మొదలైంది’ చిత్రం తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి నిత్యా మీనన్ ని పరిచయం చేసింది. ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో నిత్యా మీనన్ కి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమాకి ఒప్పుకోకుండా కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆమె ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇది ఇలా ఉండగా గతం లో నిత్యామీనన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఆమెని తీవ్రమైన ఇబ్బందికి గురి చేసిందట. ఆ కారణం చేత ఆమె ప్రతీ రోజు వెక్కిళ్లు పెట్టి ఏడవాల్సి వచ్చిందట. ఇంతకు అసలు ఏమి జరిగిందంటే నిత్యా మీనన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఆమెకి నేటి తరం స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా తెలియదట. ఒకసారి ఆమె ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్ప్పుడు ప్రభాస్ గురించి ఒక ప్రశ్న అడిగితే, ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని చెప్పిందట. ఆమె అలా మాట్లాడడం తో మీడియా లో నిత్యామీనన్ మీద ఇష్టమొచ్చిన కథనాలు ప్రచురితం అయ్యేవి అట.

అవి చూసి ప్రభాస్ అభిమానులు ఆమెని సోషల్ మీడియా లో టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ల్స్ చేసేవారట. ఆ ట్రోల్స్ చూసి నిత్యామీనన్ ఏడవని రోజు లేదట. కేరళ లో పుట్టి పెరిగిన నిత్యామీనన్ కి మన టాలీవుడ్ నుండి కేవలం చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మరియు అల్లు అర్జున్ మాత్రమే తెలుసట. తనకి తెలిసిన విషయాన్నీ నిర్మొహమాటంగా చెప్పినందుకు నన్ను ఇంతలా వేధిస్తారా అని అప్పట్లో నిత్యా మీనన్ సోషల్ మీడియా లో ఒక వీడియో పెట్టిన సందర్భం కూడా ఉందట. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన ముక్కుసూటి తనాన్ని వదులుకోనని, నా మనసులో ఏది ఉంటే అదే చెప్తాను అంటూ అప్పట్లో నిత్యామీనన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.