Nithin : ఒక హిట్ కొడితే అరడజను ప్లాప్స్ ఇవ్వడం నితిన్ కి ఆనవాయితీగా మారింది. కెరీర్ బిగినింగ్ నుండి ఆయనది ఇదే తీరు. అందుకే తనకంటూ ఓ రేంజ్, ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఆయన లేటెస్ట్ హిట్ భీష్మ. 2020లో ఈ మూవీ విడుదల కాగా నితిన్ కి మరో హిట్ పడలేదు. రంగ్ దే, చెక్ ఫ్లాప్ అయ్యాయి. మ్యాస్ట్రో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేదు. గత ఏడాది విడుదలైన మాచర్ల నియోజకవర్గం ఆయన ఖాతాలో మరో ఫ్లాప్ గా చేరింది. అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనూహ్యంగా పరాజయం పాలైంది.
ఈ క్రమంలో కలిసొచ్చిన కాంబినేషన్ నమ్ముకున్నాడు. దర్శకుడు వెంకీ కుడుములతో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. ఉగాది కానుకగా నితిన్ కొత్త మూవీ ప్రకటన కోసం స్పెషల్ వీడియో రూపొందించారు. గ్రాండ్ గా తెరకెక్కించిన కొన్ని నిమిషాల ప్రమోషనల్ వీడియో ఆసక్తి రేపింది. సినిమా మీద అంచనాలు పెంచేసింది. ‘మేము ఎవరి మనోభావాలు దెబ్బతీయడం లేదు, మా మనోభావాలు మేమే దెబ్బతీసుకుంటున్నాం’ అని చెప్పడం బాగుంది. ఈ ప్రమోషనల్ వీడియోలో హీరోయిన్ రష్మిక మందాన, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, దర్శకుడు వెంకీ కుడుముల భాగమయ్యారు.
టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తోంది. వెంకీ కుడుముల-రష్మిక మందాన-నితిన్ కాంబోలో తెరకెక్కిన భీష్మ సూపర్ హిట్. మరో విశేషం ఏమిటంటే… భీష్మ అనంతరం వెంకీ కుడుముల మరో చిత్రం చేయలేదు. ఆయన చిరంజీవితో ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. భీష్మ చిత్రం చూసి ఇంప్రెస్ అయిన చిరంజీవి ఆఫర్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. కారణం తెలియదు కానీ వెంకీ కుడుముల-చిరంజీవి ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.
దీంతో నితిన్ తో ఆయన మరో చిత్రం చేస్తున్నారు. ఇక రష్మిక మందానకు లైఫ్ ఇచ్చిన దర్శకుడిగా వెంకీ కుడుముల ఉన్నారు. తెలుగులో ఆమెను ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. ఛలో సూపర్ హిట్ కాగా రష్మికకు వరుస ఆఫర్స్ దక్కాయి. స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. టైటిల్ ప్రకటించాల్సి ఉంది. త్వరలో షూటింగ్ మొదలవుతుంది.
#VNRTrio is back with something more entertaining and more adventurous 💥💥
Watch now!
– https://t.co/BEG0The5vLMore details soon!@actor_nithiin @iamRashmika @VenkyKudumula @MythriOfficial pic.twitter.com/9jzTtHAzcb
— G.V.Prakash Kumar (@gvprakash) March 22, 2023