భారీగా పడిపోయిన ‘చెక్’ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?

తెలుగు ఇండస్ట్రీలో ‘జయం’ సినిమాతో హీరోగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నితిన్.. అద్దిరిపోయే హిట్ తో లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత చాలాకాలం ఫెయిల్యూర్స్ టేస్ట్ చేశాడు. ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ‘అ.. ఆ’ మూవీతో మరో రేంజ్ కు వెళ్లాడీ హీరో. తాజాగా.. రిలీజ్ అయిన నితిన్ మూవీ ‘చెక్’. Also Read: వెండితెర‌పై ‘ఆట’ షురూ.. మోత మోగ‌నున్న థియేట‌ర్లు! చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో, […]

Written By: Bhaskar, Updated On : March 2, 2021 2:02 pm
Follow us on


తెలుగు ఇండస్ట్రీలో ‘జయం’ సినిమాతో హీరోగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నితిన్.. అద్దిరిపోయే హిట్ తో లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత చాలాకాలం ఫెయిల్యూర్స్ టేస్ట్ చేశాడు. ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ‘అ.. ఆ’ మూవీతో మరో రేంజ్ కు వెళ్లాడీ హీరో. తాజాగా.. రిలీజ్ అయిన నితిన్ మూవీ ‘చెక్’.

Also Read: వెండితెర‌పై ‘ఆట’ షురూ.. మోత మోగ‌నున్న థియేట‌ర్లు!

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో, భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి మాలిక్ సంగీతం అందించారు. అయితే.. ఆరంభం నుంచి కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్న నితిన్.. ఇందులో మొదటిసారి నటనకు అవకాశం ఉన్న భిన్నమైన పాత్రలో కనిపించాడు.

నితిన్ లాస్ట్ మూవీ ‘భీష్మ’తో భారీ హిట్‌ను అందుకోవడంతో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో చెక్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది. అయితే.. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా.. మొదటి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌తో నడుస్తోంది. దీంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. దీనికి తోడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’, అల్లరి నరేష్ ‘నాంది’ హవా కొనసాగడంతో ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతూ వచ్చింది.

Also Read: నో లవ్ స్టోరీ.. యంగ్ హీరో సంచలన నిర్ణయం

మూడు రోజులూ ఎలాగోలా నెట్టుకొచ్చినా.. నాలుగో రోజు కలెక్షన్లు సగానికి పడిపోయాయి. దీంతో.. నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్‌లో రూ. 6 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4.10 లక్షలు, గుంటూరులో రూ. 3.90 లక్షలు, నెల్లూరులో రూ. 2.60 లక్షలు రాబట్టింది. టోట‌ల్ గా.. నాలుగో రోజు రూ. 53 లక్షలు షేర్, రూ. 91 లక్షలు గ్రాస్ మాత్ర‌మే వచ్చింది.

దీంతో.. నాలుగు రోజుల్లో మొత్తంగా క‌లిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.41 కోట్లు, మిగిలిన‌ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 63 లక్షలతో మొత్తం రూ. 8.29 కోట్లు వ‌సూలు చేసింది. అంటే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన‌ రూ. 16.50 కోట్లు రాబ‌ట్టాలంటే.. మరో రూ. 8.21 కోట్లు రాబట్టాలి. మ‌రి, ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇది సాధ్య‌మ‌వుతుందా? లేదా? అన్నది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్