రేషన్‌ వాహనాలకు గ్రీన్‌ సిగ్నల్‌

ఏపీలో గడప గడపకూ రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా 9,260 మొబైల్ డెలివరింగ్ యూనిట్స్ వాహనాలు ప్రారంభించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ ఈ పథకాన్ని రూపొందించారు. Also Read: టీఆర్ఎస్ ఎంపీ ఖాతాలో రూ.400 కోట్ల […]

Written By: Srinivas, Updated On : March 2, 2021 1:52 pm
Follow us on


ఏపీలో గడప గడపకూ రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా 9,260 మొబైల్ డెలివరింగ్ యూనిట్స్ వాహనాలు ప్రారంభించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ ఈ పథకాన్ని రూపొందించారు.

Also Read: టీఆర్ఎస్ ఎంపీ ఖాతాలో రూ.400 కోట్ల బ్లాక్ మనీ..!

అయితే.. ఏపీలో ఎన్నికల వేళ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ చేయడానికి వీలు లేదంటూ ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌‌ ఆదేశాలిచ్చారు. ఎందుకంటే రేషన్‌ పంపిణీ చేసే వాహనాలకు వైసీపీ కలర్స్‌ ఉండడంతో ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. కమిషనర్‌‌ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఎంక్వైరీ జరుగగా.. నేడు ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఏపీలో వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ వాహనాలను ఎన్నికల నేపథ్యంలో వాడుకునే విషయంలో పాజిటివ్‌ తీర్పువచ్చింది. దీంతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రేషన్ వాహనాలను తిప్పుకునే అవకాశం దొరికింది.

ఏపీలో స్ధానిక సంస్థలు జరుగుతున్న వేళ వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. సీఎం జగన్ ఫొటోతో ఉన్న వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరుతుందని విపక్షాల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. విచారణ జరుగుతున్న తరుణంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

Also Read: మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ కొట్టేనా..! : బెంగాల్ లో గెలుపెవరిది?

రేషన్‌ వాహనాలను రంగు మార్చి తిప్పుకునేందుకు అభ్యంతరం లేదని తొలుత చెప్పిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తరఫు న్యాయవాదులు, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో హైకోర్టు పిటిషన్‌ను డిస్పోజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో స్థానిక ఎన్నికల వేళ ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారీ ఊరటగా మారింది. ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ వాహనాల ద్వారా పంపిణీ చేస్తుందన్న అంశాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లే అవకాశం దక్కింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్