Thammudu Movie Closing Collections: సంక్రాంతి తర్వాత మన టాలీవుడ్ సరైన సక్సెస్ లేక డీలాపడిన సమయంలో ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం విడుదలై మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ టాలీవుడ్ గాడిలో పడింది అని అనుకుంటే, ‘కన్నప్ప'(Kannappa Movie), ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రాల రూపంలో మరోసారి భారీ డిజాస్టర్స్ ని ఎదురుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని మంచు విష్ణు(Manchu Vishnu) సొంతంగా విడుదల చేశాడు. నష్టాలు వస్తే ఆయనకే వచ్చాయి కానీ, థియేటర్స్ లో మంచు విష్ణు రేంజ్ కి తగ్గట్టుగానే ఆడింది. కానీ ‘తమ్ముడు’ చిత్రం మాత్రం ఇండస్ట్రీ కి కోలుకోలేని దెబ్బ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని 70 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. నాన్ థియేట్రికల్ రైట్స్ 30 కోట్లకు అమ్ముడుపోయింది దిల్ రాజు స్వయంగా చెప్పాడు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
కానీ నెట్ ఫ్లిక్స్ తో డీల్ అంటే, సినిమా హిట్ అయితే ఒక రేట్, హిట్ అవ్వకపోతే మరో రేట్ ఉంటుంది. కాబట్టి ‘తమ్ముడు’ చిత్రం 30 కోట్ల కంటే తక్కువ రేట్ కి అమ్ముడుపోయి ఉంటుంది అని అనుకుంటున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రన్ పూర్తి అయ్యింది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత నష్టాలు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఈమధ్య కాలం లో ఒక సినిమా విడుదలై వారం రోజులకే క్లోజింగ్ కలెక్షన్స్ పడడం అనేది ఈ చిత్రానికే జరిగింది. అసలే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కెరీర్ ని పూర్తిగా రిస్క్ లో పడేలా చేసింది ఈ చిత్రం. నైజాం ప్రాంతం లో నితిన్ మొదటి నుండి చాలా స్ట్రాంగ్ అని అంటుంటారు విశ్లేషకులు. అలాంటి ప్రాంతం లో ఈ చిత్రానికి క్లోజింగ్ లో కోటి 10 లక్షల రూపాయిల షేర్ వచ్చింది అంటేనే అర్థం చేసుకోండి, ఏ రేంజ్ డిజాస్టర్ అనేది.
అదే విధంగా సీడెడ్ లో 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లో కేవలం కోటి 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అలా ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇది సాధారణమైన డిజాస్టర్ కాదు. పాతిక కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ మార్కుతో దిగిన ఈ చిత్రం 90 శాతం నష్టాలను మూటగట్టుకుంది.