Nithin – Srinu Vaitla Movie Updates: ‘బలగం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వేణు(Venu Yeldandi) తెరకెక్కించాలని అనుకున్న డ్రీం ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ'(Yellamma Movie). దిల్ రాజు(Dil Raju) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు కదలడం లేదు. ముందుగా ఈ మూవీ స్టోరీ నేచురల్ స్టార్ నాని వద్దకు వెళ్ళింది. ఆయన చేస్తానని చెప్పలేదు, చెయ్యను అని కూడా బలంగా చెప్పలేదు. కానీ దిల్ రాజు ఎదురు చూడలేక నితిన్(Nithin) తో ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేశాడు. ‘తమ్ముడు’ మూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ‘ఎల్లమ్మ’ ని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ‘తమ్ముడు’ చిత్రం ఎవ్వరూ ఊహించనంత బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో దిల్ రాజు కి మళ్లీ నితిన్ పై డబ్బులు ఖర్చు చేసే ధైర్యం రాలేదు. ఇప్పుడు ఆయన కార్తీ కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నితిన్, వెంటనే వేరే ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు.
ఒకప్పుడు కామెడీ కమ్ కమర్షియల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న శ్రీను వైట్ల తో త్వరలోనే నితిన్ ఒక సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ కాంబినేషన్ చిత్రం రానుంది. అయితే ఏ నిర్మాత కూడా ఇప్పుడు నితిన్ కి నేరుగా రెమ్యూనరేషన్ ఇచ్చే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈ ఒక్క ఏడాదిలోనే నితిన్ తన కెరీర్ లో రెండు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. అందులో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ చిత్రం కూడా ఉంది. భారీ నష్టం వచ్చిన సినిమా బ్యానర్ లోనే పనిచేస్తుండడం తో ఇప్పుడు నితిన్ ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ సినిమా చేస్తున్నట్టు సమాచారం.
సినిమా విడుదలై, సూపర్ హిట్ అయ్యాక లాభాలు వస్తే అందులో మాత్రమే షేర్ తీసుకుంటాడట. దీనిని చూసి ఎందుకు నితిన్ ఇలా అయిపోతున్నాడు?, వచ్చే డబ్బులు కూడా వదులుకుతున్నాడు. పోనీ డైరెక్టర్ మంచి ఫార్మ్ లో ఉన్నాడా అంటే అది కూడా లేదు. శ్రీను వైట్ల అవుట్ డేటెడ్ అయ్యి చాలా కాలం అయ్యింది. ఆయన తో సినిమాలు చేసేందుకు ఇప్పుడు ఎవ్వరూ సిద్ధంగా లేరు. పోనీ ఆయన స్క్రీన్ ప్లే మార్చుకునే ఉద్దేశ్యం ఏదైనా ఉందా అంటే అది కూడా లేదు. ఆయన గత చిత్రం ‘విశ్వం’ అందుకు ఒక ఉదాహరణ. అలాంటి డైరెక్టర్ తో సినిమా చేసి నితిన్ ఎలా సక్సెస్ కొట్టగలడు?, కెరీర్ ని మరింత డ్యామేజ్ చేసుకుంటున్నాడు అంటూ నితిన్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.