Nithin : హీరో నితిన్(Actor Nithin) కి ప్రస్తుతం నడుస్తున్నంత బ్యాడ్ లక్ ఏ ఇతర టాలీవుడ్ హీరో కి కూడా నడవడం లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతని సినిమా స్వేచ్ఛగా, సోలో గా రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. ఉదాహరణకు రీసెంట్ గా విడుదలైన ‘రాబిన్ హుడ్'(Robin Hood) ని తీసుకోవచ్చు. వాస్తవానికి ఈ సినిమా అంత పెద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా అయితే కచ్చితంగా కాదు. కానీ ఈ సినిమా విడుదలైన రోజునే ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు విడుదలకు ముందే అంచనాలు భారీగా ఉండేవి. ఇక విడుదల తర్వాత మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ సునామీ ని సృష్టించింది. అదే రోజున విడుదలైన ‘రాబిన్ హుడ్’ చిత్రాన్ని పాపం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా క్లోజింగ్ లో పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు.
Also Read : రాబిన్ హుడ్ ఫుల్ మూవీ రివ్యూ…
ఇకపోతే లేటెస్ట్ గా ఆయన వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) తో ‘తమ్ముడు'(Thammudu Movie) అనే చిత్రం చేసాడు. దిల్ రాజు(Dil Raju) ఈ చిత్రానికి నిర్మాత. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సమ్మర్ లో ఒక్క సరైన సినిమా లేక బయ్యర్స్ ముఖం వాచిపోయి ఉన్నారు. థియేటర్స్ ని అనేక ప్రాంతాల్లో మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో తమ్ముడు చిత్రం విడుదల అయ్యుంటే కచ్చితంగా నితిన్ కుంభస్థలం బద్దలు కొట్టే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే ఈ సినిమా చాలా బాగా వచ్చిందట. నితిన్ కం బ్యాక్ ఈ చిత్రం తో చాలా ఘనంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. వేణు శ్రీ రామ్ కూడా మంచి విషయం ఉన్న డైరెక్టర్ అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. కాబట్టి ఇతని మీద ఆడియన్స్ కి నమ్మకం ఉంటుంది.
పైగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్, పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని అద్భుతమైన సినిమాని అందించిన డైరెక్టర్, హీరో పవన్ కళ్యాణ్ వీరాభిమాని, కచ్చితంగా పవన్ అభిమానుల నుండి ఈ సినిమాకు సపోర్ట్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. ఇలా అన్ని విధాలుగా మంచి అడ్వాంటేజ్ ఉన్న ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చేయకుండా జులై నెలలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడట నిర్మాత దిల్ రాజు. జులై నాల్గవ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడట. జులై నెలలో వర్షాలు మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే ‘తమ్ముడు’ చిత్రానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సినిమా మొత్తం రెడీ గా ఉన్నప్పటికీ కూడా ఎందుకు సమ్మర్ లో విడుదల చేయడం లేదని బయ్యర్స్ నిర్మాత దిల్ రాజు పై ఒత్తిడి పెడుతున్నారు.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!