Nithin: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేసి టాప్ రేంజ్ కి వెళ్లారు. కానీ ఒక హీరో మాత్రం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లందరితో సినిమాలు చేసినప్పటికి ఆయన ఇప్పటికి మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే నితిన్… తేజ, రాజమౌళి, పూరి జగన్నాథ్, వి వి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, కరుణాకరన్ లాంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలను చేసి కూడా తను టాప్ హీరోగా మారలేకపోయాడు. నిజానికి నితిన్ సినిమా సెలక్షన్లలో చాలావరకు లోపం ఉంటుంది. ఆయన ఒక సినిమాతో సక్సెస్ ని సాధిస్తే మరో నాలుగు సినిమాలతో డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నాడు ఎందుకని అలాంటి నాసిరకపు కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కథల విషయంలో క్లారిటీతో ముందుకు వెళ్తే అతనికి కూడా మంచి సక్సెస్ లు వస్తాయి కదా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రేక్షకుల యొక్క అభిరుచి తెలుసుకొని అతని నుంచి వాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. కానీ అనవసరపు పోకడలకు పోయి మాస్ సినిమాలు అంటూ యాక్షన్ ఎపిసోడ్స్ ని నమ్ముకుంటే మాత్రం నితిన్ లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కెరియర్ స్టార్టింగ్ లో లవర్ బాయ్ క్యారెక్టర్ లను చేసుకుంటూ ముందుకు వెళ్లిన ఆయన ఆ తర్వాత యాక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపించాడు.
కానీ అవేవీ అతనికి కలిసి రాలేదు. ఇష్క్ సినిమాతో గదిలో పడ్డ ఆయన భీష్మ సినిమా తరవాత నుంచి వరుస డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. ఇప్పటికి వరుసగా 6 ఫ్లాప్ సినిమాలను చేసి ప్రేక్షకుల్లో తన క్రేజ్ ను పూర్తిగా కోల్పోయాడు… ఇక ఇప్పుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాని చేస్తున్నాడు. వి ఐ ఆనంద్ తోనే ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన మేకింగ్ కొత్తగా ఉంటుంది.
కథ సెలక్షన్ కూడా చాలా వరకు విభిన్నమైన శైలిలో ఉంటుంది. ఇక ఇంతకుముందు ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో సక్సెస్ ని సాధించి మంచి ట్రాక్ లో ఉన్నాడు. కాబట్టి అతను అయితేనే బావుంటుందనే ఉద్దేశ్యంతో నితిన్ అతన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది…
ఇక గతంలో 14 ప్లాప్ సినిమాల్లో ఉన్న నితిన్ కి ఇష్క్ లాంటి మంచి సినిమాని అందించిన విక్రమ్ కే కుమార్ సైతం నితిన్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు…మరి తనకి సక్సెస్ ఇచ్చిన దర్శకుడిని పక్కన పెట్టి వి ఐ ఆనంద్ తో చేస్తున్న సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…