Vijay Devarakonda Ranabaali: ‘కింగ్డమ్’ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘రణబలి'(Ranabali Movie). శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మొదటి నుండి ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది. ఎందుకంటే ఈ డైరెక్టర్ సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి, అత్యధిక శాతం సూపర్ హిట్ సినిమాలే ఇతని ఖాతాలో ఉన్నాయి. అలాంటి డైరెక్టర్ విజయ్ దేవరకొండ తో ఆసక్తికరమైన పీరియడ్ డ్రామా చేస్తున్నాడు అనే విషయం తెలిసినప్పటి నుండి ఆడియన్స్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక నేడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేసిన తర్వాత ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ వీడియో కాన్సెప్ట్ చాలా బాగుంది కానీ, అది విజయ్ దేవరకొండ కి అసలు సూట్ కాలేదని అంటున్నారు.
Ok Ok intensity kanabadindi inka vadiley…. Saavadengaku ➡️ https://t.co/uzUFYyI26E pic.twitter.com/dYcRMHqk5D
— నాగరాజు పాండే (@Mahesh__4Akhil) January 26, 2026
ఎందుకు విజయ్ దేవరకొండ ఇలా తన ఇమేజ్ కి సూట్ అవ్వని సినిమాలు చేస్తున్నాడు?, చక్కగా పక్కింటి కుర్రాడి పాత్రలు ఉండే సినిమాలు చేసుకోవచ్చు కదా, విజయ్ కి ఇలాంటి క్యారెక్టర్స్ పోషించేంత స్క్రీన్ ప్రెజెన్స్, నటన అనుభవం లేదని విశ్లేషకుల వాదన. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో వచ్చే షాట్ లో విజయ్ దేవరకొండ ఎక్స్ ప్రెషన్స్ ని చూస్తే నవ్వొచ్చింది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేసున్నారు. ఈ గ్లింప్స్ వీడియో వచ్చిన కాసేపటికి విజయ్ దేవరకొండ మరో పోస్టర్ ని విడుదల చేసాడు. ముఖానికి గంధం రాసుకొని, సైడ్ యాంగిల్ లో ఆయన ఇచ్చిన ఫోజుని చూస్తే మన అందరికీ వెంటనే పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’ చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ లుక్ నే ఇక్కడ కాపీ కొట్టారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్స్ వేస్తున్నారు.
pic.twitter.com/UOMDeoEv3c https://t.co/dZA9r11PAo
— Jesse (@jesse_bb99) January 26, 2026
ఇకపోతే ఈ చిత్రానికి అజయ్ – అతుల్ సంగీతం అందించారు. బాలీవుడ్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకులు వీళ్లిద్దరు. ఈ గ్లింప్స్ వీడియో కి కూడా అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా విజయ్ దేవరకోన త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రష్మిక నటిస్తోంది. ఆమె లుక్ కూడా మహారాణి లుక్ లాగ ఉంది. చూస్తుంటే ఈ జంటకు మంచి క్యారెక్టర్స్ పడినట్టుగా అనిపిస్తుంది. నటిగా రష్మిక మందాన తనని తానూ నిరూపించుకుంది, ఇలాంటి రోల్స్ ఆమెకు కొట్టినపిండి లాంటిది, కానీ విజయ్ దేవరకొండ ఎలా నటిస్తాడు అనే దానిపైనే ఈ సినిమా ఫలితం ఆధారపడుంది. వరుస ఫ్లాప్స్ ని అందుకుంటున్న ఆయన ఈ చిత్రం తో కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
Nak telikunda dhoni cinema loki entry eppudu ichadu https://t.co/RS0AYLdWUg
— Young_Rebel (@known_as__varma) January 26, 2026
https://t.co/qOByHnFn8Q pic.twitter.com/3dHF97jp85
— Nanii!! (@narasimha_chow2) January 26, 2026