Hari Hara Veera Mallu Business : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా పై సోషల్ మీడియా లో జరిగిన నెగెటివ్ ప్రచారం ఎలాంటిదో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆ నెగెటివ్ ప్రచారాలకు నిన్న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చెక్ పెట్టింది. ఇంతటి భారీ సినిమా కోసం ఈ రేంజ్ టైం తీసుకోవడం లో ఎలాంటి తప్పు లేదని ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాత AM రత్నం(AM Ratnam) ట్రైలర్ విడుదల అయ్యే వరకు బిజినెస్ చెయ్యను అని బయ్యర్స్ తో మొహమాటం లేకుండా చెప్పాడట.
ఎందుకంటే AM రత్నం అడుగుతున్న డబ్బులకు బయ్యర్స్ ఆసక్తి చూపించలేదు. దీంతో ట్రైలర్ విడుదల అయ్యాక మీరే నా దగ్గరకు వచ్చి నేను అడిగినంత ఇస్తారు అనే తీరుని ప్రదర్శించాడు రత్నం. ఆయన ఆశించినట్టుగానే ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాకు అన్ని ప్రాంతాల నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నైజాం ప్రాంతం లో నిర్మాత రత్నం మొదటి నుండి అక్కడి బయ్యర్స్ ని 65 కోట్ల రూపాయిలను అడుగుతున్నాడు. కానీ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థ 55 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం గా ఉంది. మరో రెండు రోజుల్లో ఈ డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అదే విధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 11 కోట్ల రూపాయలకు ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ రెండు ప్రాంతాల నుండే 66 కోట్ల రూపాయలకు ఈ సినిమా అమ్ముడుపోయింది.
మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా వచ్చే సోమవారం లోపు పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడట నిర్మాత AM రత్నం. ఈ నెల 10వ తారీఖు లోపు ఫస్ట్ కాపీ ని సిద్ధం చేసి సెన్సార్ కి పంపించబోతున్నారట. ఆరోజు నుండే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా ప్రారంభిస్తారని టాక్. నిన్న ట్రైలర్ తో వచ్చిన జోష్ ని అలాగే కొనసాగించాలని, ఎక్కడా తగ్గకుండా చూసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి అభిమానులను ఎన్నో రోజుల నుండి ఊరిస్తున్న ఈ సినిమా, సక్సెస్ అవుతుందా లేదా అనేది.