Nithya Menon: విశ్వక్ ఖంతడేరాజు దర్శకత్వంలో నిత్యామేనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా స్కైలాబ్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. విభిన్న కథాంశంతో తెరెక్కిన ఈ సినిమాకు నిత్యామేనన్ నిర్మాతగా వ్యవహరించారు. డిసెంబరు 4న థియేటర్స్లో విడుదల కానున్న సందర్భంగా.. హీరోయిన్ నిత్యా మేనన్ మీడియాతో ముచ్చటించారు.
ఈ క్రమంలోనే తాను నిర్మాతగా మారడానికి గల కారణాలతో పాటు, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీరూ వినండి.

నిర్మాతగా స్కైలాబ్ నా ఫస్ట్ సినిమా. డబ్బులుకోసమైతే నిర్మాతగా మారలేదు. మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే అదుదేశంతోనే నిర్మాతగా మారా. సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో భాగంగానే నిర్మాతగా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. అని వివహించింది నిత్య.
అప్పట్లో స్కైలాబ్ గురించిన భిన్నమైన కథనాలను చెప్పారు. స్కైలాబ్ భూమి మీద పడిపోతే చనిపోతామనే భ్రమలో చాలామంది తాము కూడబెట్టుకున్న ఆస్తులను ఖర్చు చేసేశారట. మరికొందరైతే బంగారు నాణేలు మింగేశారని చెబితే ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి అంశాలు నేనీ సినిమా చేసేందుకు దోహదం చేశాయి. బండిలింగంపల్లిలో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథే ఈ చిత్రం. అని నిత్య ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో నిత్య జర్నలిస్టు పాత్రలో కనిపించుండగా.. రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్ విభిన్న పాత్రలో దర్శనమివ్వనున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుదో వేచిచూడాలి.