Homeజాతీయ వార్తలుChina Salt: చైనా నే కాదు..చైనా ఉప్పూ ప్రమాదమే

China Salt: చైనా నే కాదు..చైనా ఉప్పూ ప్రమాదమే

China Salt: ఆ ఉత్పత్తులకు గ్యారెంటీ ఉండదు. వాటి పనితీరుకు వారంటీ ఉండదు.. చైనా తయారు చేసే ప్రొడక్ట్స్ మీద సోషల్ మీడియాలో కనిపించే జోక్ ఇది. నిజంగానే చైనా ఉత్పత్తిలో చూపించే దూకుడు తనాన్ని నాణ్యతలో చూపించదు. పనితీరులో ప్రదర్శించదు. దానికి కేవలం మార్కెట్ మొత్తాన్ని హస్తగతం చేసుకోవడం.. అత్యంత తక్కువ ధరలో ఉత్పత్తులను అందించడం.. అందువల్లే చైనా ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరలో అందిస్తుంది కాబట్టి అన్ని దేశాలు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంటాయి.

చైనాలో తయారయ్యే ఉత్పత్తులు మాత్రమే కాదు.. చివరికి ఆహారానికి సంబంధించిన పదార్థాలు కూడా అత్యంత డేంజర్ గా ఉంటాయి. ముఖ్యంగా చైనాకు సంబంధించి వాడే సాల్ట్ దీనిని అజీనోమోటో అని పిలుస్తుంటారు. దీనిని ఫాస్ట్ ఫుడ్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇది రోజుకు అయిదు గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే శరీరానికి కీడు చేస్తుంది. చైనా ఉప్పులో గ్లూటామిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీనిని వాడితే నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది. ఒబెసిటీ.. మైగ్రేన్.. హై బీపీ వంటి రుగ్మతలకు ఇది దారితీస్తుంది. సాధ్యమైనంత వరకు గర్భిణీలు దీనిని వాడకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

చైనాలో ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. గతంలో ఇటువంటి ఆహారం మనదేశంలో అంతగా ఉండేది కాదు. కానీ కొన్ని సంవత్సరాలుగా చైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనదేశంలో కూడా విరివిగా ఏర్పాటయ్యాయి. చైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా ఫ్రైడ్ రైస్.. నూడుల్స్ తయారు చేస్తూ ఉంటారు. వీటిల్లో రుచి కోసం చైనా సాల్ట్ వాడుతూ ఉంటారు. ఇది తాత్కాలికంగా రుచి కలిగించినప్పటికీ.. దీర్ఘకాలంలో శరీరం మీద అనేక రకాలుగా దుష్పరిణామాలను చూపిస్తూ ఉంటుంది. మెదడు.. హృదయం.. జీర్ణాశాయానికి సంబంధించిన అనేక వ్యాధులను ఇది కలిగిస్తూ ఉంటుంది. అందువల్లే చైనా సాల్ట్ ను చాలావరకు దేశాలు నిషేధించాయి. మనదేశంలో మాత్రం ఇది యధావిధిగా అమ్ముడుపోతోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దీనిని విపరీతంగా వాడుతున్నారు. దీని వాడకాన్ని నిరోధిస్తేనే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని వైద్యులు చెబుతున్నారు.

చైనా సాల్ట్ లో కృత్రిమ పదార్థాలను అధికంగా వాడుతారు. దీనివల్ల అది కొంచెం నోట్లో వేసుకోగానే ఒక రకమైన రుచి కలుగుతూ ఉంటుంది. పైగా చైనా సాల్ట్ లో రకరకాల రసాయనాలు ఉంటాయి. అవి చూసేందుకు స్పటికాల మాదిరిగా ఉంటాయి. దీనివల్ల శరీరం మీద ముఖ్యంగా అంతర్గత అవయవాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. పరిమితికి మించి వీటిని తీసుకుంటే శరీరం అనేక రకాల రుగ్మతలకు గురవుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version