Nikhil Karthikeya 2: ‘కార్తికేయ 2’ ప్రస్తుతం హిందీ బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబడుతోంది. దాంతో, ఈ సినిమా పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ప్రశంసలు కురిపిస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. “ఆమిర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ కంటే.. నిఖిల్ ‘కార్తికేయ-2′ ఎక్కువ కలెక్షన్స్ ను రాబడుతుంది అని ఆర్జీవీ పోస్ట్ పెట్టాడు. ”నిఖిల్ కార్తికేయ 2 మూవీ ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ 2 కంటే, రాజమౌళి తీసిన RRRల కంటే ఎంతో గొప్పది. బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం అదరగొడుతోంది. హ్యాట్యాఫ్ టూ నిఖిల్’ అంటూ ఆర్జీవీ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నిజంగానే నిన్న అమిర్ లాల్ సింగ్ చడ్డా రూ.1.49 కోట్లు కలెక్ట్ చేయగా, అక్షయ్ రక్షాబంధన్ రూ. 1.01 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు మూవీల కంటే కార్తికేయ 2 చిత్రానికి 3.04 కోట్లను నిఖిల్ కొల్లగొట్టాడు. అంటే ఆమిర్ కంటే డబుల్, అక్షయ్ కంటే మూడింతలు కలెక్షన్లను నిఖిల్ రాబట్టాడు. ఇది షాకింగే. ఒక తెలుగు యంగ్ హీరో సినిమా ప్రవాహంలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కొట్టుకుపోవడం అంటే.. ఎన్నడూ ఊహించని విషయమే.
మరోపక్క ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ ఛడ్డా’, అక్షయ్ కుమార్ ” రక్షాబంధన్ సినిమాల వసూళ్లు నిజంగానే ట్రేడ్ వర్గాలను విస్మయపరిచాయి. మూడో వీక్ లోకి ఎంటర్ అవుతున్నా… ఇప్పటివరకు వీటిలో ఏ సినిమా 50 కోట్ల మార్కును దాటలేదు. పైగా కార్తికేయ-2 సినిమా దెబ్బకు అమీర్ – అక్షయ్ సినిమాలు పూర్తిగా చేతులు ఎత్తేశాయి. దీనికి తోడు కార్తికేయ 2కి హిందీ బెల్టులో రోజురోజుకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది.

స్టార్ హీరోలు అమీర్ – అక్షయ్ సినిమాలను కూడా పక్కన పెట్టేసి మరీ.. హిందీ బయ్యర్లు కార్తికేయ 2కి థియేటర్స్ వేస్తున్నారు. అలాగే తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దొబారా పరిస్థితి అయితే మరీ దారుణం. స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 19న విడుదలైంది. ఈ చిత్రం కేవలం 370 స్క్రీన్ల లోనే విడుదలైంది. కానీ, సాయంత్రం తిరిగే సరికి చాలా థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ప్రస్తుతం కేవలం 2-3 శాతం ఆక్యుపెన్సీతో దొబారా నడుస్తోంది. ఇది ఇంకా దారుణం. 35 కోట్లు పెట్టి తీస్తే.. ఈ సినిమాకి తొలి రోజు రూ. 72 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు మరో 70 లక్షలు వచ్చాయి. మూడో రోజు వచ్చే సరికి చాలా షోలు రద్దయ్యాయి.
మొత్తానికి బాలీవుడ్ లో దూసుకెళ్తున్న తాప్సీ కెరీర్లో ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలేలా ఉంది. అసలు, బాలీవుడ్‌కు ఏదో శని పట్టుకున్నట్లే ఉంది. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న హిందీ పరిశ్రమకు ఊపిరిపోద్దామనుకుని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావడం లేదు. బస్తీమే సవాల్ అంటూ బాక్సాఫీస్ బరిలో దిగిన ఎన్నో పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తున్నాయి. దీనికితోడు కార్తికేయ 2 లాంటి తెలుగు సినిమాలు హిందీ తెరను ఏలుతున్నాయి. ప్రస్తుతం కార్తికేయ 2కి 40 శాతం ఆక్యుపెన్సీ పెరిగింది.
ఈ ఆక్యుపెన్సీ రానున్న రెండు రోజుల్లో ఇంకా పెరిగేలా ఉంది. తాప్సీ నటించిన దొబారా చిత్రం థియేటర్లు అన్నీ కార్తికేయ 2కి ఇస్తున్నారు. ఇదే ఊపు కంటిన్యూ అయితే.. కార్తికేయ 2కి మరో 15 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అలా వస్తే.. ఈ చిత్రం నాలుగింతలు లాభాలను సాధించినట్టే.
