HomeActorsNagababu warning: చిరంజీవిని అవమానిస్తే ఊరుకునేది లేదు.. నాగబాబు హెచ్చరిక

Nagababu warning: చిరంజీవిని అవమానిస్తే ఊరుకునేది లేదు.. నాగబాబు హెచ్చరిక

Nagababu warning: మెగా బ్రదర్స్ లో ఏ అవసరం వచ్చినా నాగబాబు ఉంటాడు. చిరంజివి, నాగబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురు అన్నదమ్ములన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరు హీరోలు కాగా నాగబాబు నిర్మాతగా మారారు. ఎవరి రంగంలో వారు రాణిస్తున్నారు. ఇప్పటికి సినిమాలు తీస్తూ మెగాస్టార్ చిరంజీవి తన ఉనికి చాటుతున్నాడు. ఇక పవన్ కల్యాణ్ విషయం చెప్పనక్కరలేదు. తెలుగు సినిమా రంగాన్ని ఊపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అన్నదమ్ముల అవినాభావ సంబంధం గురించి అందరు ముచ్చటపడుతుంటారు. అసలు చిరంజీవి లేకపోతే వీరంతా ఉండేవారు కాదేమో అనే సందేహాలు వస్తుంటాయి.

Nagababu warning
Nagababu warning

Also Read: Pawan Kalyan: పవన్ ను టార్గెట్ చేస్తున్న నీలిమీడియా..ఆ మాటలను వక్రీకరిస్తూ..

చిరంజీవి, పవన్ కల్యాణ్ కు ఏ ఇబ్బంది వచ్చిన వెంటనే నాగబాబు కల్పించుకోవడం తెలిసిందే. దీంతో అన్న, తమ్ముడిని ఎవరైనా విమర్శిస్తే తక్షణమే స్పందించి వారి అంతు చూస్తానని స్పందిస్తుంటాడు. అన్నదమ్ములను అనవసరంగా నిందిస్తే వారి అంతు చూస్తామని బెదిరిస్తుంటాడు. ప్రస్తుతం ఇదే తరహాలో స్పందించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ను కావాలని విమర్శలు చేస్తే సహించేది లేదని చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు మాట్లాడారు. మా అన్నదమ్ముల విషయంలో ఎవరైనా దూరితే ఊరుకునేది లేదని సవాలు చేశారు.

Chiranjeevi - Nagababau
Chiranjeevi – Nagababau

Also Read: Amit Shah-Jr NTR Meeting: అమిత్ షా -జూనియర్ ఎన్టీఆర్ భేటిలో ఏం జరిగింది?

మెగా అభిమానుల మధ్య చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మా జోలికి ఎవరొచ్చినా దాని ఫలితం అనుభవిస్తారని వార్నింగ్ ఇచ్చారు. తమ మనుగడకు ఎవరు అడ్డు వచ్చినా ఉపేక్షించబోమని చెబుతున్నారు. 1976లో 21 ఏళ్ల వయసులో వచ్చిన చిరంజీవి తనదైన ప్రతిభతో రాణించి పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడం గమనార్హం. దీంతో మెగా అభిమానుల మధ్యలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని అందరిలో ఉత్తేజం నింపారు.

Chiranjeevi - Nagababau - Pawan kalyan
Chiranjeevi – Nagababau – Pawan kalyan

Also Read: Kangana Ranaut Sensational Decision: కంగనా రనౌత్ సంచలన నిర్ణయం.. షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇదెక్కడి విడ్డూరం ?

ఇక తమ్ముడు పవన్ కల్యాణ్ దర్శకుడు అవుదామని వచ్చి హీరోగా మారాడు. ఇది మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఇక తిరుగే లేదని నిరూపిస్తున్నాడు. నటనలో అన్నయ్య పేరు నిలబెడుతున్నాడు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు చిరుపై విమర్శలు చేస్తున్న సందర్భంలో నాగబాబు వేగంగా స్పందించారు. అన్నయ్య గురించి ప్రేలాపణలు చేస్తే ఊరుకునేది లేదని బదులిస్తున్నాడు. చిరు, పవన్ లపై విమర్శలకు దిగిగే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version