https://oktelugu.com/

తప్పు చేయదు. చేసుకోక తప్పదు: నిఖిల్

టాలీవుడ్ కుర్ర హీరోల్లో కాస్త సామాజిక సేవను ఎక్కువగా ప్రదర్శించడానికి తాపత్రయ పడే హీరో నిఖిల్. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనదైన శైలిలో ప్రజలకు మేలు చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. పనిలో పనిగా నలుగురికి సాయం చేసి.. అది నలుదిక్కులా తెలిసేలా నానా హడావుడి చేస్తాడు. ఏది ఏమైనా నిఖిల్ ఉన్న హీరోల్లో తాను బెటర్ పర్సన్ అనే పేరును తెచ్చుకున్నాడు. ఇక తాజాగా నిఖిల్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. అయితే తానూ వ్యాక్సిన్ […]

Written By:
  • admin
  • , Updated On : July 3, 2021 / 09:00 AM IST
    Follow us on

    టాలీవుడ్ కుర్ర హీరోల్లో కాస్త సామాజిక సేవను ఎక్కువగా ప్రదర్శించడానికి తాపత్రయ పడే హీరో నిఖిల్. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనదైన శైలిలో ప్రజలకు మేలు చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. పనిలో పనిగా నలుగురికి సాయం చేసి.. అది నలుదిక్కులా తెలిసేలా నానా హడావుడి చేస్తాడు. ఏది ఏమైనా నిఖిల్ ఉన్న హీరోల్లో తాను బెటర్ పర్సన్ అనే పేరును తెచ్చుకున్నాడు.

    ఇక తాజాగా నిఖిల్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. అయితే తానూ వ్యాక్సిన్ తీసుకుంటున్న సమయంలో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. ‘వ్యాక్సినేషన్ తప్పు చేయదు. చేసుకోక తప్పదు’ అంటూ తనలోని భావుకతను ప్రపంచానికి పరిచయం చేయడానికి మీనింగ్ గట్రా లాంటివి కూడా చూసుకోకుండా ఒక పోస్ట్ అయితే పెట్టాడు.

    మొత్తమ్మీద అందరూ వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పడానికి ఈ కుర్ర హీరో ఈ పోస్ట్ పెట్టాడట. ఈ మధ్య కుర్ర హీరోల్లో కూడా డైలాగ్ రైమింగ్ బాగుంటుంది. యతి ప్రాసలను కరెక్ట్ గా వాడుతూ వాటికీ తమదైన శైలిని జోడిస్తున్నారు. మొన్న నాని కూడా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఇలాగే ఫన్నీగా రాస్తూ చక్కటి కొటేషన్ కూడా రాసుకొచ్చాడు. ఇప్పుడు నిఖిల్ కూడా ఇదే ఫాలో అయ్యాడు.

    ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా ’18 పేజెస్’. కాగా ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీ వేదిక పైనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక మరో చిత్రం ‘కార్తీకేయ 2’ షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది.