https://oktelugu.com/

NTR- Koratala Siva Film: ఎన్టీఆర్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. కొరటాల ఏమి చేస్తాడో ?

NTR- Koratala Siva Film: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివకు ఆచార్య బాగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం కొరటాల పూర్తి నిరాశలో ఉన్నాడు. అందుకే.. తన తర్వాత సినిమా విషయంలోనైనా అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కొరటాల పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరోపక్క కొరటాలతో సినిమా చేయడానికి ఎన్టీఆర్, తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు. కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అయితే, కొరటాల కూడా ఎన్టీఆర్ తో […]

Written By:
  • Shiva
  • , Updated On : May 4, 2022 / 08:59 AM IST
    Follow us on

    NTR- Koratala Siva Film: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివకు ఆచార్య బాగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం కొరటాల పూర్తి నిరాశలో ఉన్నాడు. అందుకే.. తన తర్వాత సినిమా విషయంలోనైనా అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కొరటాల పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరోపక్క కొరటాలతో సినిమా చేయడానికి ఎన్టీఆర్, తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు.

    NTR- Koratala Siva Film

    కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అయితే, కొరటాల కూడా ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. మరీ పాన్ ఇండియా సినిమా అంటే హీరోయిన్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా. అందుకే.. ఆలియా భట్ ను ఫైనల్ చేసుకున్నారు. కానీ.. ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

    Also Read: Hero Nikhil: తండ్రి కోరిక కోసం తమ్ముడ్ని హీరోని చేస్తున్నాడు !

    రణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకున్న ఆలియా.. తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలి అంటే.. సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. మొత్తానికి ఎన్టీఆర్ కి అలియా షాక్ ఇచ్చింది. అయితే, ఆలియా భట్ ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలి ? ఇదే కొరటాలలో మెదులుతోన్న ప్రశ్న.

    అలియా స్థాయి హీరోయిన్ కావాలంటే.. కచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్నే తీసుకోవాలి. అందుకే.. కియారా అద్వానీ పేరు బాగా వినిపిస్తోంది. అలాగే రష్మిక మందన్నా పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఫైనల్ గా ఈ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తోందో చూడాలి.

    NTR- Koratala Siva Film

    ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు. అందుకోసం.. హాలీవుడ్ యాక్షన్ టెక్నీషియన్స్ ను పెట్టుకుంటున్నాడు.

    మరి చూడాలి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక కొరటాల ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఓ సోషల్ మెసేజ్ పాయింట్ ను చెప్పబోతున్నాడు. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే జులై నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.

    Also Read:Samantha Cars: సమంత ఎన్ని కార్లు వాడుతుందో తెలుసా?

    Recommended Videos

    Tags