Nikhil Kavya Controversy: సినిమాల్లో సమంత(Samantha Ruth Prabhu), నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) జంటకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో, బుల్లితెర పై నిఖిల్(Nikhil Maliyakkal) , కావ్య(Kavya) జంటకు అలాంటి క్రేజ్ ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి బుల్లితెర లో కొన్ని సీరియల్స్ లో నటించారు. అలా సీరియల్స్ చేస్తున్న సమయంలో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి జంటగా ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొనేవారు. మంచి క్యూట్ జంటగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, అకస్మాత్తుగా వీళ్లిద్దరు విడిపోయారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళు విడిపోయారు అని తెలిసిన తర్వాత వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన మనసులో ఇంకా కావ్య ఉంది అనే విషయాన్ని బయటపెట్టి అందరినీ షాక్ కి గురి చేసాడు.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లిన వెంటనే ఆమెని కలుస్తానని, కచ్చితంగా తిడుతుంది, కొడుతుంది, తట్టుకొని భరిస్తాను కానీ , ఆమెని వదిలి ఉండలేను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కన్నీళ్లను కావ్య నమ్మలేదు. అంతా నాటాకాలు అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది. ఇక నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆమెని కలవలేదు, ఆమె గురించి మాట్లాడేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ కావ్య హీరోయిన్ గా నటిస్తున్న ‘చిన్ని’ అనే సీరియల్ లో గెస్ట్ రోల్ లో కనిపించాడు. వీళ్లిద్దరు నేరుగా మాట్లాడుకున్నది ఈ సీరియల్ లోనే. కానీ ఎలాంటి ప్యాచప్ జరగలేదని తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన జబర్దస్త్ కమెడియన్ వర్ష నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ అనే ప్రోగ్రాం లో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో నిన్న విడుదలైంది.
ఈ ఇంటర్వ్యూ లో ఆయన బిగ్ బాస్ లో కావ్య ని తల్చుకుంటూ ఏడవడం నాటకమా అనే ప్రశ్నకు దీటైన సమాధానం చెప్పాడు. నిఖిల్ మాట్లాడుతూ ‘అమ్మాయిలు ఏడిస్తే అయ్యో పాపం అంటారు. అదే అబ్బాయి ఏడిస్తే సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నాడు అంటారు. నేను ఎప్పుడు నాటకాలు ఆడను. ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పేస్తాను. అనవసరం గా నమ్మి మోసపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఈ ప్రోమో లో ఏమేమి మాట్లాడాడో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో. ప్రస్తుతం నిఖిల్ ‘కిరాక్ బాయ్స్..కిలాడీ గర్ల్స్’ అనే ప్రోగ్రాం లో పాల్గొంటున్నాడు. ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారమయ్యే ఈ ఎంటర్టైన్మెంట్ షో ఈ వీకెండ్ తో ముగుస్తుంది. ఆ తర్వాత నిఖిల్ ఏమి చెయ్యబోతున్నాడు?, మళ్ళీ బిగ్ బాస్ లోకి వస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
