Nikhil and Kavya : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేర్లు నిఖిల్(Nikhil Maliyakkal), కావ్య(Kavya Shree). ‘గోరింటాకు’ అనే సూపర్ హిట్ సీరియల్ ద్వారా వీళ్లిద్దరు మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమయ్యారు. ఈ సీరియల్ షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరు ప్రేమించుకున్నారు. ఈ జంట కలిసి ఎన్నో షోస్ లో కనిపించారు కూడా. కానీ అకస్మాత్తుగా ఏమైందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి లవ్ బ్రేక్ అయ్యింది. నిఖిల్ కావ్య తో విడిపోయినప్పటి నుండి చాలా వీక్ అయిపోయాడు. మానసికంగా కృంగిపోయాడు. కనీసం బిగ్ బాస్ కి వెళ్తే, ఆమెని కొన్ని రోజులు మర్చిపోయి ఉండొచ్చని, బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. ఆ షోలో ఆయన ఎంత అద్భుతంగా రాణించాడో మన అందరికీ తెలిసిందే. బిగ్ బాస్(Bigg Boss Telugu 8) హిస్టరీ లోనే ఆడిన అన్ని టాస్కులలో 90 శాతానికి పైగా సక్సెస్ రేట్ ని సాధించిన ఏకైక కంటెస్టెంట్ గా చరిత్ర సృష్టించి, టైటిల్ ని కూడా గెలుచుకున్నాడు.
అయితే హౌస్ లో ఉన్నన్ని రోజులు నిఖిల్ వెంట అమ్మాయిలు ఎలా తిరిగారో మనమంతా చూసాము. ముందుగా కిరాక్ సీత లైన్ వేసింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత ఫైర్ బ్రాండ్, ఆడపులి గా పిలవబడే యష్మీ నిఖిల్ వెంట ఎలా తిరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ నిఖిల్ మాత్రం ఆమెని పట్టించుకోలేదు, ఆయన మనసులో ఇప్పటికీ కావ్యనే ఉందని షో చివరి స్టేజికి వచ్చినప్పుడు చెప్పాడు. అప్పుడు యష్మీ కూడా అర్థం చేసుకొని నిఖిల్ ని పట్టించుకోవడం మానేసింది. అయితే షో లో ఉన్నప్పుడు నా మనసులో ఇంకా కావ్య నే ఉందని, ఆమె స్థానాన్ని ఎవరికీ ఇవ్వలేనని, బయటకి వెళ్లిన తర్వాత ఆమెను కచ్చితంగా కలుస్తానని, అవసరమైతే కాళ్ళు పట్టుకొని మళ్ళీ ప్యాచప్ అయిపోతాను అంటూ ఆయన మాట్లాడిన మాటలు సెన్సేషన్ ని క్రియేట్ చేసాయి అప్పట్లో.
కావ్య మాత్రం నిఖిల్ మాటలను నమ్మలేదు. డ్రామాలు ఆడుతున్నాడు అంటూ ఇంస్టాగ్రామ్ లో స్టోరీలు కూడా పెట్టింది. ఆమె ఫైర్ ని చూసి నిఖిల్ కూడా ఇప్పటి వరకు కావ్య ని కలవలేదు. ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ లోని ఒక ఎపిసోడ్ లో ఇద్దరు పాల్గొన్నారు కానీ, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ని ఇస్తూ వీళ్లిద్దరు కలిసి ఒక సీరియల్ లో కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతీరోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘చిన్ని'(Chinni Serial) అనే సీరియల్ లో కావ్య హీరోయిన్ గా నటిస్తున్నా సంగతి తెలిసిందే. తదుపరి ఎపిసోడ్స్ నుండి ఈ సీరియల్ లో నిఖిల్ కూడా భాగం కాబోతున్నాడని లేటెస్ట్ ప్రోమో ద్వారా తెలియచేసారు స్టార్ మా ఛానల్. ఇక ఈ సీరియల్ కి టీఆర్ఫీ రేటింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుందని అభిమానులు అంటున్నారు. ఆ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.
Also Read : లైవ్ లో నిఖిల్ కి ఇచిపారేసిన కావ్య..కనీసం నిఖిల్ మొహం వైపు కూడా చూడలేదుగా..వీళ్ళు ఈ జన్మలో కలిసేలా లేరు!
