https://oktelugu.com/

Kavya : లైవ్ లో నిఖిల్ కి ఇచిపారేసిన కావ్య..కనీసం నిఖిల్ మొహం వైపు కూడా చూడలేదుగా..వీళ్ళు ఈ జన్మలో కలిసేలా లేరు!

ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్ లవ్ స్టోరీ గురించి బుల్లితెర షోస్ ని అనుసరించే ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఆయన కావ్య అనే టీవీ సీరియల్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడని, అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చిందని, ఇవన్నీ తెలిసిన విషయాలే.

Written By:
  • Vicky
  • , Updated On : December 25, 2024 / 04:30 PM IST

    Kavya

    Follow us on

    Kavya : ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్ లవ్ స్టోరీ గురించి బుల్లితెర షోస్ ని అనుసరించే ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఆయన కావ్య అనే టీవీ సీరియల్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడని, అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చిందని, ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ఇంకా కావ్య ని మర్చిపోలేకపోతున్నాను అని, బయటకి వెళ్లిన తర్వాత ఆమె ని కలుస్తానని, తిట్టినా కొట్టినా సరే ఆమెతో మళ్ళీ ప్యాచప్ అయిపోతానని చెప్పడం మనమంతా చూసాము. కేవలం ఆయన మనసులో కావ్య ఉండడం వల్లే, యష్మీ పరోక్షంగా నిఖిల్ కి ప్రపోజ్ చేసినప్పటికీ పట్టించుకోలేదని అందరికీ అర్థమైంది. అయితే బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత నిఖిల్ ఇప్పటి వరకు కావ్య ని కలవలేదు కానీ, వీళ్లిద్దరు కలిసి ఒక షోలో పాల్గొనే అవకాశం మాత్రం వచ్చింది.

    ప్రతీ ఆదివారం రోజు స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోకి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్న విషయం తెలిసిందే. బుల్లితెర ఫేమస్ యాక్టర్స్ ఈ షోలో పాల్గొని సందడి చేస్తుంటారు. అయితే ఈ ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసింది స్టార్ మా టీం. ఈ ఎపిసోడ్ లో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ఒక జట్టుగా, అదే విధంగా స్టార్ మా సీరియల్ ఆర్టిస్ట్స్ మరో జట్టుగా కలిసి గేమ్స్ ఆడుతారు. నిఖిల్ ఈ షోకి కప్పుతో వస్తాడు. ఆ తర్వాత శ్రీముఖి నిఖిల్ తో మాట్లాడుతూ అక్కడ స్టార్ మా పరివారం ఉంది చూసావా అని అంటుంది. అప్పుడు నిఖిల్ చూసా అని సమాధానం ఇస్తాడు. వాళ్లందరినీ పరిచయం చేస్తానని వాళ్ళ దగ్గరకి తీసుకెళ్తుంది శ్రీముఖి.

    మానస్, ప్రియాంక జైన్, బాలు, శివ్ లను పరిచయం చేసిన శ్రీముఖి, కావ్య వద్దకు వచ్చేలోపు ఆమె ముఖం పక్కకి తిప్పేసుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మీరు కూడా ఈ క్రింద చూసేయండి. కావ్య ముఖం లో నిఖిల్ మీదున్న కోపాన్ని మనం గమనించొచ్చు. చూస్తుంటే ఆమె నిఖిల్ తో ప్యాచప్ అవ్వడానికి అసలు ఇష్టం చూపించట్లేదని తెలుస్తుంది. అయితే ఎంతైనా నిఖిల్ తో ఐదేళ్లపాటు ప్రేమాయణం నడిపింది కావ్య. కాబట్టి కనీసం స్నేహితులుగా అయినా ఉండొచ్చు కదా, ఎందుకు అలా శత్రువులాగా చూడడం అని ఈ ప్రోమో ని చూసిన ఆడియన్స్ అంటున్నారు. అసలు కావ్య కి నిఖిల్ వస్తున్నాడనే విషయం స్టార్ మా టీం ముందుగా చెప్పిందా, లేదా అని ఈ ప్రోమో వీడియో క్రింద నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఈ షో ద్వారా కలిసిపోతే బాగుంటుంది అని కోరుకుంటున్నారు.