Actor Nikhil: నిఖిల్, అనుపమ ల “18 పేజీస్” సినిమా పోస్టర్ విడుదల…

Actor Nikhil: యంగ్ హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ జంటగా ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి దీపావళి కానుకగా ఓ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నిఖిల్ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 4, 2021 6:18 pm
Follow us on

Actor Nikhil: యంగ్ హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ జంటగా ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి దీపావళి కానుకగా ఓ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నిఖిల్ సైకల్ తొక్కుతూ కనిపిస్తుండగా… అనుపమ తన అందం తో ఆకట్టుకుంటుంది. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీత అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నారు. ఇక పోస్టర్ ను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో కెరియర్‌లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది.
అలానే నిఖిల్  చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ కి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.