Niharika Divorce: నిహారిక కొణిదెల, వెంకట చైతన్య దంపతులు కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. మార్చి నెలలో వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. దాంతో విబేధాల తలెత్తాయనే వార్తలకు బీజం పడింది. ఇది జరిగిన కొన్ని రోజులకు నిహారిక సైతం వెంకట చైతన్య ఫోటోలు సోషల్ మీడియా అకౌంట్స్ నుండి తొలగించారు. దీంతో వీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని కథనాలు మొదలయ్యాయి. దానికి తోడు నిహారిక, వెంకట చైతన్య దాఖలాలు లేవు.
ఈ క్రమంలో నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేశారు. ది పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్లో ప్రాజెక్ట్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే నటిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆమె డెడ్ ఫిక్సెల్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకకు వెంకట చైతన్య రాలేదు. నిహారిక ఒంటరిగా ఈ ఫంక్షన్ లో పాల్గొంది.
నిహారిక-వెంకట చైతన్యలకు విడాకులు అనివార్యమే అని తెలుస్తుండగా… అధికారిక సమాచారం అందింది. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక, వెంకట చైతన్య విడాకులకు అప్లై చేశారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. నిహారికతో వెంకట చైతన్య బంధానికి తెరపడింది. కాగా అప్పుడే నిహారిక రెండో పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిహారికకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు అయిన ఓ వ్యక్తిని ఆమె వివాహం చేసుకోబోతున్నారట. వీలైనంత త్వరలో వారి వివాహం ఉంటుందట.
దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక 2020 డిసెంబర్ లో నిహారిక-వెంకట చైతన్యల వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది. ఐదు రోజులు పెద్ద ఎత్తున నిర్వహించారు. మెగా ఫ్యామిలీ హీరోలందరూ పాల్గొన్న ఈ వివాహం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. పెళ్ళైన రెండేళ్లకు మనస్పర్థలతో విడిపోయారు.