KH233 Movie: ఖాకీ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న డైరెక్టర్ హెచ్ వినోద్ వరుసగా అజిత్ తో చిత్రాలు చేశారు. అజిత్-వినోద్ కాంబినేషన్ లో నెర్కొండ పార్వై, వలిమై, తునివు చిత్రాలు తెరకెక్కాయి. ఇవి వరుసగా విడుదల కావడం విశేషం. దర్శకుడు అజిత్ ఆయనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ఇచ్చాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఏకంగా కమల్ హాసన్ తో మూవీ ప్రకటించారు. కమల్ హాసన్ 233వ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకుడు అంటూ ప్రకటన వచ్చింది. అనౌన్స్మెంట్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది.
కమల్ హాసన్ అభివాదం చేస్తున్న ఫోజ్ చూస్తుంటే ఇది పొలిటికల్ థ్రిల్లర్ కావచ్చనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే లో నటిస్తున్నారు. ఆయనది విలన్ రోల్ అనే ప్రచారం జరుగుతుంది. రెండు భాగాలుగా విడుదలయ్య ప్రాజెక్ట్ కేలో ప్రభాస్-కమల్ హాసన్ మధ్య భీకర పోరాటాలు ఉంటాయని సమాచారం.
అలాగే దర్శకుడు మణిరత్నంతో ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు. దశాబ్దాల అనంతరం కమల్ హాసన్, మణిరత్నం కలిసి చిత్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఇంకా సమయం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో హెచ్ వినోద్ మూవీ కమల్ హాసన్ పూర్తి చేస్తారట. ఏడు పదుల వయసులో కమల్ హాసన్ కుర్ర హీరోలకు ధీటుగా ప్రాజెక్ట్ ప్రకటిస్తున్నారు. ఆయన లేటెస్ట్ రిలీజ్ విక్రమ్ రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విక్రమ్ కమల్ హాసన్ కి భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. విక్రమ్ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కింది. అలాగే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న భారతీయుడు 2 షూటింగ్ చివరి దశకు చేరింది. మరో 20 రోజుల చిత్రీకరణ మిగిలి ఉన్నట్లు సమాచారం. భారతీయుడు 2 వివాదాలతో ఆగిపోయింది. విక్రమ్ మూవీ సక్సెస్ కావడంతో భారతీయుడు 2 చిత్రాన్ని పట్టాలెక్కించారు.
And it begins…#RKFI52 #KH233
#RISEtoRULE #HVinoth #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/7cej87cghE— Kamal Haasan (@ikamalhaasan) July 4, 2023