https://oktelugu.com/

Chaitanya: 2వ పెళ్లి చేసుకుంటున్న నిహారిక మాజీ భర్త చైతన్య..పెళ్లి కూతురు నిహారికకు మంచి స్నేహితురాలు..ఎవరో గుర్తుపట్టగలరా?

పూర్తి వివరాల్లోకి వెళ్తే చైతన్య అతి త్వరలోనే రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడట. పెళ్లి కూతురు మరెవరో కాదు, నిహారిక కి అత్యంత సన్నిహితులలో ఒకరట. వీళ్లిద్దరి పెళ్ళిలో కూడా ఆమె సందడి చేసిందట.

Written By:
  • Dharma
  • , Updated On : November 8, 2024 / 04:13 PM IST

    Chaitanya

    Follow us on

    Chaitanya: ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు ఒకరిని ఒకరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, చిన్న చిన్న మనస్పర్థలు వచ్చి విడిపోవడం వంటివి సర్వసాధరణం అయిపొయింది. పెళ్ళైన రెండు మూడేళ్లకే విడాకులు తీసుకోవడం వంటి సంఘటనలు ఈమధ్య కాలంలో మనం ఎన్నో చూసి ఉంటాము. అలాంటి జంటలలో మనం ముందుగా నిహారిక కొణిదెల, చైతన్య గురించి మాట్లాడుకోవాలి. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక, పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి, పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో నటనకి గుడ్ బై చెప్పి చైతన్య అనే వ్యక్తిని పెళ్లాడింది. వీళ్లిద్దరి వివాహాన్ని నాగబాబు రాజస్థాన్ లోని ఒక ప్యాలస్ ఎలా ఎంత వైభోగంగా జరిపించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. పెళ్ళైన కొత్తల్లో వీళ్లిద్దరు ఎంతో అన్యోయంగా ఉండేవారు.

    వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో చూస్తే కచ్చితంగా వాళ్లకు దిష్టి తగులుతుంది. అంత ముచ్చటగా అనిపిస్తుంది ఈ జంట. అలాంటి జంట కలకాలం సంతోషంగా ఉంటుందని అనుకున్నారు కానీ, ఇలా పెళ్ళైన రెండేళ్లకే విడిపోతారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అయితే చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక మళ్ళీ కెరీర్ పరంగా బిజీ అయ్యింది. పలు వెబ్ సిరీస్ లను నిర్మించిన ఈమె, రీసెంట్ గానే ఈ ఏడాదిలో ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి, నిహారికని ఇండస్ట్రీ లో ఒక సక్సెస్ ఫుల్ నిర్మాతగా నిలబెట్టింది. ఇదంతా పక్కన పెడితే నిహారిక మాజీ భర్త చైతన్య గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియా లో తెగ ప్రచారం అవుతుంది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే చైతన్య అతి త్వరలోనే రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడట. పెళ్లి కూతురు మరెవరో కాదు, నిహారిక కి అత్యంత సన్నిహితులలో ఒకరట. వీళ్లిద్దరి పెళ్ళిలో కూడా ఆమె సందడి చేసిందట. దీంతో ఎవరు ఆ అమ్మాయి?, ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయా?, లేకపోతే బయట అమ్మాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదంతా పక్కన పెడితే చైతన్య కూడా సినిమాలను నిర్మించేందుకు అప్పట్లో తన అపార్ట్మెంట్స్ లోనే ఒక ఆఫీస్ కూడా పెట్టుకున్నాడు. నిహారిక తో కలిసి జాయింట్ గా సినిమాలను నిర్మించాలని రూట్ మ్యాప్ చేసుకున్నాడు. అలా ఎన్నో ప్లాన్స్ వేసుకున్న ఈ జంట చివరికి విడాకులు తీసుకున్నారు. అయితే సినిమాల ట్రైల్స్ లో ఉన్న చైతన్య కి రీసెంట్ గానే ఒక యంగ్ హీరోయిన్ పరిచయం అయ్యిందని, బహుశా ఆమెనే కాబోయే భార్య అవ్వొచ్చని అంటున్నారు విశ్లేషకులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలియనున్నాయి.