Aadhaar Update: ఆధార్‌ అప్‌డేట్‌కు ఇదే లాస్ట్‌ ఛాన్స్‌.. లేకుంటే కార్డు రద్దు!

అధార్‌ కార్డులు జారీ అయి పదేళ్లు దాటిన వారంతా అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం చాలాకాలంగా సూచిస్తోంది. ఉచిత అప్‌డేట్‌కు ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగింది. కానీ, చాలా మంది చేసుకోలేదు.

Written By: Dharma, Updated On : November 8, 2024 4:10 pm

Aadhaar

Follow us on

Aadhaar Update: ఆధార్‌ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇది. ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయినవారు తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)చాలా కలంగా సూచిస్తోంది. ఉచితంగా అప్‌డేట్‌ కోసం గడువు ఇస్తూ వస్తోంది. తాజాగా ఆ గడువును డిసెంబర్‌ 14 వరకు పొడిగింది. ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ అని ప్రకటించింది. ఈసారి అప్‌డేట్‌ చేసుకోకపోతే.. ఆధార్‌ కార్డులు రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డులను గడువులోపు అప్డేట్‌ చేసుకోవడం చాలా అవసరం. ఇప్పటికీ చాలా మంది అప్‌డేట్‌ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో అప్‌డేట్‌ చేయని కార్డులను రద్దు చేయాలనే ఆలోచనలో యూఐడీఏఐ ఉన్నట్లు తెలుస్తోంది.

ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి..
ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు అన్నింటికీ ఉపయోగించే ఆధార్‌ కార్డు ప్రస్తుతం దేశంలో ముఖ్యమైన గుర్తింపు క ఆర్డుగా ఉంది. పదేళ్లలో చాలా మంది చిరునామా, ఫొటో మారుతుంది. ఈ నేపథ్యంతో తాజా వివరాలతో అప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. దీంతో మోసాలకు చెక్‌ పెట్టవచ్చు.

డిసెంబర్‌ 14 ఆఖరి గడువు?
జారీ అయి పదేళ్లు దాటిన ఆధార్‌ సమాచారన్ని అప్‌డేట్‌ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్‌ 14 వరకు గడువు విధించింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగింది. మొదట మార్చి 14, తర్వాత జూన్‌ 14, ఆ తర్వాత సెప్టెంబర్‌ 14 వరకు పెంచింది. ఇప్పుడు డిసెంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చింది. ఇక ఇదే చివరి గడువు అని డెడ్‌లైన్‌ విధించింది.

ఇలా అప్‌డేట్‌ చేయండి..

– ’’MyAadhaar’’ పోర్టల్‌ ఓపెన్‌చేసి.. లాగిన్‌ అవ్వాలి. తర్వాత మీ ఆధార్‌ నంబర్, మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. మీ గుర్తింపు చిరునామా కోసం కొత్త పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి.

– డిసెంబర్‌ 14 వరకు ఈ సర్వీస్‌ ఉచితం. దీనిని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా అప్‌డేట్‌ చేసుకోవాలి.

ఈ పత్రాలు అవసరం..
ఆధార్‌ అప్‌డేట్‌కు రేషన్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, జన ఆధార్‌ కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, లేబర్‌ కార్డు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు సీజీహెఎచ్‌ఎస్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. పత్రాలు లేకుండా అప్‌డేట్‌ చేయడం కుదరదు.