https://oktelugu.com/

Kethireddy: గుడ్ మార్నింగ్ ధర్మవరం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్.. వారమే డెడ్ లైన్!

వైసీపీ నేతల భూ దాహంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఒక్కోనేత బండారాన్ని బయటపెడుతోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు చెందిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి షాక్ ఇచ్చింది కూటమి సర్కార్.

Written By:
  • Dharma
  • , Updated On : November 8, 2024 / 04:17 PM IST

    Kethireddy

    Follow us on

    Kethireddy: గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సందడి చేసేవారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ప్రతిరోజు ఉదయం నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుంటూ హల్చల్ చేసేవారు. ఎమ్మెల్యే అయితే ఇలా ఉండాలి అనేలా గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజలకు అంతలా సేవ చేస్తే తిరస్కరించడాన్ని తట్టుకోలేకపోయారు.గత కొద్దిరోజులుగా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ విశ్లేషణలు ప్రారంభించారు.పనిలో పనిగా పార్టీ వైఫల్యాలను సైతం బయట పెట్టేవారు.ఒకానొక దశలో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం సాగింది.కానీ అదంతా ఉత్త ప్రచారమేనని.. చివరివరకు జగన్ వెంట తాను ఉంటానని స్పష్టం చేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వంమాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి షాక్ ఇచ్చింది.ధర్మవరానికి ఆనుకొని ఉన్న చిక్క వడియార్ చెరువును ఆక్రమించారంటూ నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అక్కడ భూమికి సంబంధించి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య వసుమతికి నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయాలని.. లేకుంటే అక్కడ నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే కేతిరెడ్డి ప్రధానఅనుచరుడు సూర్యనారాయణ సైతం ధర్మవరం తాసిల్దార్ నోటీసులు జారీ చేశారు.ప్రభుత్వ భూమిని ఆక్రమించారని.. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. అక్కడ మొత్తం 30 ఎకరాలు కబ్జా కోరల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఏకంగా కేతిరెడ్డి కుటుంబానికి నోటీసులు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనగా మారింది.

    * పెద్ద ఎత్తున భూ ఆరోపణలు
    2019 ఎన్నికల్లో ధర్మవరంనియోజకవర్గం నుంచి గెలిచారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున భూములను ఆక్రమించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.గత ఏడాది అనంతపురంలో లోకేష్ పాదయాత్ర చేశారు.ఆ సమయంలో ధర్మవరంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కబ్జాలు చేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు.దీనికి దీటుగా స్పందించారు కేతిరెడ్డి.ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు.ఆ తరువాత రోజు చెరువు కబ్జా జరిగింది అంటూ కొన్ని డాక్యుమెంట్లను లోకేష్ విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేతిరెడ్డి భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు లోకేష్. తాజాగా నోటీసులు జారీ చేయడం విశేషం.

    * చెరువు భూమి ఆక్రమణ
    ధర్మవరానికి ఆనించి ఉంటుంది శక్తి వడియార్ చెరువు. దానికి సంబంధించి భూ రికార్డులను పరిశీలించారు అధికారులు.దానిని ఆక్రమించినట్లు గుర్తించారు.కేతిరెడ్డి తమ్ముడి భార్య వసుమతికి నోటీసులు జారీ చేశారు.ఆ నోటీసులను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి చిరునామాకు పంపించారు.అక్కడ రైతుల నుంచి 25 ఎకరాలు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంది. మరో 20 ఎకరాల వరకు చెరువు భూమినిఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఫామ్ హౌస్ తో పాటు రేసింగ్ ట్రాక్, గుర్రాల కోసం షెడ్లు, చెరువులో బోటింగ్ వంటివి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని పండ్ల తోటలను సైతం సాగు చేస్తున్నట్లు సమాచారం. ఈ భూములన్నీ కేతిరెడ్డి మరదలు వసుమతి, ఆయన అనుచరుడు సూర్యనారాయణ పేరుతో ఉన్నట్లు ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. కాగా ఈ నోటీసులపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. తనను రాజకీయంగా టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు.