సాధారణంగా మనం లారీల వెనుకభాగంలో హారన్, ఓకే, ప్లీజ్ అనే పదాలు వ్రాసి ఉండటం చూసి ఉంటాము. ఇలా లారీల వెనుకభాగంలో ఈ పదాలు ఎందుకు రాసి ఉంటారు. ఇలా రాయడం వెనుక ఏదైనా అర్థం దాగి ఉందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే లారీల వెనుక భాగంలో ఇలా హార్న్, ఓకే, ప్లీజ్ అని రాయడం వెనుక ఒక కారణం ఉంది. మరి ఆ కారణం ఏంటో తెలుసుకుందాం…
ఒకప్పుడు హైవేలో సిగ్నల్ లైన్ లను కలిగి ఉండేవి కాదు.ఈ క్రమంలోనే మనం ఒక లారీ వెనుక వెళ్తున్నప్పుడు దానిని క్రాస్ చేసి వెళ్తే పొరపాటున ట్రాఫిక్ లో ఇరుక్కోవడం లేదా ఏదైనా ప్రమాదాలకు గురికావడం వంటివి జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే మనం లారీల వెనుక వెళ్తున్న సమయంలో మనం హారన్ కొట్టగానే ట్రక్ డ్రైవర్ ముందర ట్రాఫిక్ ఉందో లేదో గమనించి మనకు సరే అనే పదానికి కుడివైపు ఉన్న సిగ్నల్ లైట్ వెలిగిస్తాడు. ఇలా సిగ్నల్ లైట్ వెళ్లగానే మనం ఆ లారీని ఓవర్ టేక్ చేసి వెళ్ళవచ్చు.ప్రస్తుతం హైవేలు రావడం చేత ఈ విధమైనటువంటి అవసరం పడలేదు కానీ లారీల వెనుక మాత్రం ఇప్పటికీ ఇలా హారన్, ఓకే, ప్లీజ్ అనే పదాలు రాసి ఉంటారు.
అదే విధంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు కిరోసిన్ రవాణా చేయడం కోసం ఇలా ట్రక్కులను ఉపయోగించారని ఈక్రమంలోనే ఓకే అనగా అది కిరోసిన్ అనే అర్థాన్ని తెలపడమే కాకుండా లారీ వెనుక వచ్చే వారికి హెచ్చరిక చేసినట్లు. ఇలా కిరోసిన్ తో వెళ్లే లారీలు ఏ చిన్నపాటి ప్రమాదానికి గురైన పెద్ద నష్టం వాటిల్లుతుంది కనుక లారీలో వెనుక భాగంలో ఓకే అని రాసేవారిని తెలుస్తుంది.అయితే ఇప్పటికీ ఎంతో టెక్నాలజీ పెరిగినప్పటికీ లారీల వెనుక భాగంలో మనం ఇలా హారన్, ఓకే, ప్లీజ్ అనే పదాలను చూడవచ్చు.