Niharika: స్పెయిన్​లో నిహారికా స్కూబా డైవింగ్​.. నెట్టింట్లో వీడియో వైరల్​

Niharika: మెగా కుటుంబం గారాల పట్టి నిహారిక కొణిదెలకు గతేడాది డిసెంబరు9న చైతన్యతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబం, ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం వైభంగా జరిగింది. కాగా, ఆ తర్వాత భర్తతో కలిసి నిహారిక మాల్డీవులకు హనీమూన్ వెళ్లింది. ఇప్పుడు వన్​ ఇయర్ యానవర్సరీ కానున్న సందర్భంగా మరో సారి హనీమూన్​ వెళ్లింది ఈ జంట. అయితే, ఈ సారి స్పెయిన్​లో విహరిస్తోంది. https://www.instagram.com/tv/CXGCKzgj_BZ/?utm_source=ig_web_copy_link ఈ క్రమంలోనే నిహారి స్కై డైవింగ్​ చేసింది. […]

Written By: Raghava Rao Gara, Updated On : December 7, 2021 11:15 am
Follow us on

Niharika: మెగా కుటుంబం గారాల పట్టి నిహారిక కొణిదెలకు గతేడాది డిసెంబరు9న చైతన్యతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబం, ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం వైభంగా జరిగింది. కాగా, ఆ తర్వాత భర్తతో కలిసి నిహారిక మాల్డీవులకు హనీమూన్ వెళ్లింది. ఇప్పుడు వన్​ ఇయర్ యానవర్సరీ కానున్న సందర్భంగా మరో సారి హనీమూన్​ వెళ్లింది ఈ జంట. అయితే, ఈ సారి స్పెయిన్​లో విహరిస్తోంది.

https://www.instagram.com/tv/CXGCKzgj_BZ/?utm_source=ig_web_copy_link

ఈ క్రమంలోనే నిహారి స్కై డైవింగ్​ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది నిహారిక.  నేను సాధించా.. చాలా ఆశ్చర్యంగా ఫీల్​ అవుతున్నా.. నా ఆపడ్రోయ్​ మూమెంట్స్ అంటూ క్యాప్షన్లు జోడించింది. కాగా, నిహారిక మొదట్లో యాంకరింగ్​తో బుల్లితెరపై అడుగుపెట్టి.. ఆతర్వాత సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని నిహారిక.. తాజాగా ఓటీటీ వేదికగా మూడు ప్రాజెక్టుల్లో నటించేందుకు సిద్ధమైంది. అందులో ఒకటైన ఒక చిన్నఫ్యామిలీ స్టోరీ ఇటీవలే స్ట్రీమింగ్​ అయ్యింది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు వచ్చిన ఈ వెబ్​సిరీస్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మిగిలిన రెండు ప్రాజెక్టులకు గ్యాప్​ దొరకడంతో.. భర్తతో కలిసి స్పెయిన్​లో ఎంజాయ్​ చేస్తోంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్​గా మారాయి. అభిమానులు, పలువురు సెలబ్రిటీలు కూడా వీరి ఫొటోలకు కామెంట్లు చేస్తున్నారు.