Bheemla Nayak: బ్రహ్మానందం… తెలుగు తెరపై చెరగని చిరునవ్వును శాశ్వతంగా ఉంచిన గొప్ప కమెడియన్ లలో ఒకరు. ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని ఆయన పంచారు. కానీ ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించేశారు. అయితే ఈ తరుణంలో తాజాగా ఆయన ఒక పెద్ద సినిమాలో నటిస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల ఈటీవి ఛానల్ లో ప్రసారం అవుతున్న ఆలితో జాలీగా అనే కార్యక్రమంలో బ్రహ్మీ పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంధర్భంగా పలు ఆసక్తికర విషయాలను బ్రహ్మానందం వెల్లడించారు. వాటిలో తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో వస్తున్న బీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నట్టు వెల్లడించారు.
Brahmanandam in Bheemla Nayak
మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు. సితార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read: Pushpa Movie: “పుష్ప” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా రాబోతుంది ఎవరంటే
అలాగే రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఇక ఈ చిత్రంలో తన పాత్ర ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది.
Also Read: Pushpa Movie: పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. అదిరిపోయిన పుష్ప ట్రైలర్..