Niharika Konidela: టాలీవుడ్ లో మెగా ఫామిలీ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న వార్త బయటకి వచ్చిన అది మీడియా లో ఏ రేంజ్ వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎన్నో సంఘటనలు మనం గతం లో అలాంటివి చూసాము..ఇప్పుడు తాజాగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఇటీవలే ఈమె తన భర్త చైతన్య తో కాకుండా తన స్నేహితులతో కలిసి టర్కీ టూర్ కి వెళ్ళింది..అక్కడ ఆమె ఛిల్ల్ అవుతూ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..అక్కడి బీచ్ లో బికినీ వేసుకొని టర్కిష్ గర్ల్ తో కలిసి సెల్ఫీ దిగింది..మెగా కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి బికినీ ధరించడమే ఇక్కడ చర్చ..నిహారిక కొణిదెల సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తరుచు తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ వస్తుంది..ఆమెకి సంబంధించిన విశేషాలు మరియు ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది..అలా తన హాలిడే ట్రిప్ కి సంబంధించిన ఈ ఫోటోలను షేర్ చేసింది.

ఇక నిహారిక కొణిదెల గురించి మరికొన్ని విశేషాల్లోకి వెళ్తే ఈమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ ఆమెకి ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు..ఇక ఆ తర్వాత చైతన్య అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లాడింది..వీళ్లిద్దరి పెళ్లి ని నాగబాబు ఎంత వైభోగంగా జరిపించారో మనం ఎప్పటికి మరచిపోలేము..పెళ్ళైన తర్వాత ఆమె నటనకి పూర్తి స్థాయిలో గుడ్బై చెప్పేసింది..కొద్దీ నెలల క్రితం పాల్గొన్న ఒక బుల్లితెర కార్యక్రమం లో తన భర్తకి నేను సినిమాల్లో నటించడం ఇష్టం లేదు..అందుకే మానేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

అప్పటి నుండి నటనకి దూరంగా, వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీ బిజీ గా గడుపుతుంది నిహారిక కొణిదెల..అయితే ఇప్పుడు ఈమె సినిమాల్లోకి మల్లి అడుగుపెట్టబోతుందట..అయితే ఈసారి హీరోయిన్ గా కాదు క్యారక్టర్ ఆర్టిస్టుగా..గ్లామర్ రోల్స్ కి దూరం గా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుందట..అందుకు ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకి అనుమతిని ఇచ్చినట్టు సమాచారం..చూడాలి ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది అనేది.