
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్, నాగబాబు కుమార్తె నిహారిక గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్. ఆమె పెళ్లిపై చాలా రోజుల నుంచి పుకార్లు వస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటుందని ఓసారి.. కాదు బావ సాయిధరమ్ తేజ్‌తో పెళ్లి అని మరోసారి రూమర్స్ వచ్చాయి. తన ఫస్ట్ మూవీ హీరో నాగశౌర్యతో ప్రేమలో పడిందని, అతడితోనే మూడు ముళ్లు వేయించుకుంటుందని సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. కానీ, వీటన్నింటికీ నిహారిక చెక్ పుట్టింది. అవన్నీ పుకార్లే అని చాలాసార్లు కొట్టి పారేసింది. కానీ, తన పెళ్లి గురించి నిహారికే ఓ హింట్ ఇచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోట్ పెట్టింది. దాంతో, ఆమె పెళ్లిపై మళ్లీ చర్చ మొదలైంది.
ఓ కప్పును పట్టుకున్న ఫొటోను నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. దానిపై మిస్. నిహా అని రాసి ఉండగా.. అందులో మిస్‌లో కొట్టేసినట్టు అడ్డగా గీత పెట్టి కింద మిసెస్ అని రాసి క్వశ్చన్ మార్క్ ఉంది. ఓహ్… వాట్ అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. దాంతో, మిస్ నిహారిక.. త్వరలోనే మిసెస్ కాబోతోందని.. తన పెళ్లి కుదిరింది కాబట్టే మెగా డాటర్ఇలా సింబాలిక్‌గా చెప్పిందని ఫ్యాన్స్ అభిప్రాయప డుతున్నారు. నిహా పోస్ట్ చూసిన నెటిజన్స్ పెళ్లి కొడుకు ఎవరు? అని అడుగుతున్నారు . కొద్ది రోజుల కిందట నిహారికకి ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నామని నాగబాబు చెప్పారు. దాంతో నిహా విహావ వార్తలకు బలం చేకూరింది. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ మధ్యే కెరీర్ ప్రారంభించిన నిహారిక కన్నడ లో అరంగేట్రం చేయబోతోంది. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని ఇటీవల ప్రకటించింది. తన కెరీర్ను నచ్చినట్టు మలుచుకునే స్వేచ్ఛ కుటుంబ సభ్యులు ఇచ్చారని గతంలోనే చెప్పింది. మరి, ఇంత త్వరగా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరం అవుతుందా? చూడాలి.