
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామేతను నటీనటులు బాగా ఫాలో అవుతారు. ఈ విషయంలో హీరోయిన్లు చాలా స్పీడ్‌గా ఉంటారు. క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో ముందుంటారు. ఒకే టైమ్‌లో చాలా సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్, ఈవెంట్స్, షోస్, షోరూం ఓపెనింగ్స్ ఇలా ఏ అవకాశాన్ని వదులుకోకుండా సంపాదిస్తుంటారు. ఇంకొందరు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు. హీరోలతో పోల్చితే తెరపై వాళ్ల లైఫ్ స్పాన్, రెమ్యునరేషన్ చాలా తక్కువే కాబట్టి అలా చేయడంలో తప్పేం లేదు. కొందరు హీరోయిన్లు మాత్రం మరింత ముందున్నారు. తమ ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా వెండితెరకు పరిచయం చేస్తున్నారు. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు కాజల్ అగర్వాల్ తన చెల్లులు నిషా అగర్వాల్‌ను నాయికగా పరిచయం చేసింది. కొన్ని సినిమాల్లో ఆకట్టుకున్నప్పటికీ నిషా నటిగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా కాజల్‌ను ఫాలో అవుతోంది. ఇప్పటికే ఫిట్‌నెస్ ఫ్రాంచైజీతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన రకుల్ తాజాగా తన తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తోంది. అమన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు ‘నిన్నే పెళ్లాడతా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అతని సరసన సిద్దికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి వైకుంఠ్ బోను డైరెక్టర్. బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు నిర్మాతలు. సాయికుమార్, అన్నపూర్ణ, సీత తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1996లో విడుదలైన నాగార్జున సూపర్ హిట్ మూవీ ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్‌తో ముందుకొస్తున్న చిత్రంతో అమన్ పంచెకట్టుతో ఉన్న పోస్టర్ను నాగార్జునే రిలీజ్ చేశారు. తాజాగా మూవీ లిరికల్ వీడియో సాంగ్‌ను రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ‘సఖుడా చెలికాడా తెగువె కలవాడా సరదా వరదై రారా.. సఖుడా చెలికాడా సరసపు మొనగాడా మదిలో మదివై పోరా’ చిన్మయి పాడిన పాట ఆకట్టుకునేలా ఉంది. దీన్ని చైతన్య ప్రసాద్ రాశారు. నవనీత్ కంపోజ్ చేశారు. ఈ పాట తనను ఎంతగానో ఆకట్టుకుందని, లిరిక్స్ సూపర్బ్ అని నటి మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. పాటకు సంబంధించిన లింక్‌ను షేర్ చేసింది.
I love love love this song #sakhuda 😃😃 wishing the entire team all the best and hoping all of you give them all your love ❤️@AmanPreetOffl @sidhikasharma @MadhuraAudio https://t.co/LURTwP4Lxd check it out now 😃😃 pic.twitter.com/OOjj4TF64b
— Rakul Singh (@Rakulpreet) June 17, 2020